Perennial Flowers for Hair: రోడ్లపై పూసే ఈ పిచ్చి మొక్కల పువ్వులే జుట్టుకు అమృతం

Perennial Flowers makes hair thick and Strong: ఇటీవలి కాలంలో కేశాల సంరక్షణ అత్యంత కీలకంగా మారింది. ఆధునిక జీవనశైలి అలవాట్లు, పని ఒత్తిడి వంటి కారణాలతో జుట్టు రాలడం ప్రధాన సమస్యైంది. ప్రకృతిలో లభించే కొన్ని రకాల పూలతో ఈ సమస్యకు అద్భుతంగా చెక్ పెట్టవచ్చు. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 11, 2023, 12:13 PM IST
Perennial Flowers for Hair: రోడ్లపై పూసే ఈ పిచ్చి మొక్కల పువ్వులే జుట్టుకు అమృతం

Perennial Flowers Die will makes your Hair Healthy: ప్రకృతిలో విరివిగా లభించే పెరెన్నియల్ పూలలో ఊహించని ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా మీ కేశాల్ని సహజసిద్ధంగా ఉంచేందుకు అద్భుతంగా పనిచేస్తాయి. కేశాల సమస్య నుంచి ఉపశమనం పొందేందుకు పెరెన్నియల్ పూలు అద్భుతంగా ఉపయోగపడతాయి.

ఇటీవలి కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ జుట్టు తెల్లబడటం సమస్యగా మారిపోయింది. యుక్త వయస్సులోనే జుట్టు నెరిసిపోతోంది. ఆహారపు అలవాట్లు సరిగ్గా లేకపోవడం వల్ల ఆ ప్రభావం కేశాలపై పడుతుంటుంది. అంటే జుట్టు త్వరగా తెల్లబడుతుంటుంది. ఈ పరిస్థితుల్లో కలర్ రాయడం అలవాటు చేస్తే కేశాలు మరింత బలహీనమై త్వరగా రాలిపోతుంటాయి. అందుకే ఈ పరిస్థితి తలెత్తకుండా ఉండేందుకు కేశాల్ని ఎప్పుడూ సహజసిద్ధమైన పద్ధతులతోనే నల్లదనం అందించాలి. సహజసిద్ధమైన నలుపు రంగు అందిస్తే కేశాలు ఎప్పటికీ తెల్లబడవు.

పెరెన్నియల్ ఫ్లవర్స్

ఈ పూలతో మీ కేశాలను సహజసిద్ధమైన నలుపు రంగులో ఉంచవచ్చు. ఇవి ప్రకృతిలో మన చుట్టూ విరివిగా లభించే పూలే. కేశ సంబంధిత సమస్యలు చాలా వరకూ ఈ పూలతో పరిష్కరించుకోవచ్చు. కెమికల్స్ వాడకుండా జుట్టు నల్లబడాలంటే ఈ పూలు అద్భుతంగా ఉపయోగపడతాయి. ఈ పూలతో డై చేసుకుని రాసుకోవాలి.  అయితే దీర్ఘకాలం వినియోగించాల్సి ఉంటుంది. ఇలా చేస్తే మెరుగైన ఫలితాలు కన్పిస్తాయి. 

Also Read: White Hair: ఈ ఆయిల్‌తో పర్మినెంట్‌గా తెల్ల జుట్టు నల్లగా మారుతుంది!

పెరెన్నియల్ ఫ్లవర్స్ డై

20-30 పూలు, 15-20 ఆకులు తీసుకోవాలి. రెండు చిన్న స్పూన్స్‌తో టీ పొడి, ఒక కాఫీ తీసుకోవాలి. ముందు అర కప్పు నీళ్లలో టీ పొడి వేసి బాగా ఉడికిన తరువాత వడకాచి చల్లార్చాలి. ఆ తురవాత ఇందులో పూలు, ఆకులు వేసి గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ఓ గిన్నెలో తీసుకుని అందులో కాఫీ కలపాలి. బాగా ఎఫెక్టివ్‌గా ఉండేందుకు ఇనుప కడాయిలో 2 గంటలు వేసి ఉంచేయాలి. ఇనుప కడాయిలో ఉంచడం వల్ల ఐరన్ చేరుతుంది. కేశాలకు కావల్సిన పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. చివరిగా ఈ మిశ్రమాన్ని మీ కేశాలకు, కుదుళ్లకు బాగా పట్టించాలి. ఓ గంట తరువాత మైల్డ్ షాంపూతో శుభ్రం చేసుకోవాలి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే మంచి ఫలితాలుంటాయి.

Also Read: Weight Loss Tips: అన్నం, రోటీ మానేస్తే బరువు తగ్గడం ఎంతవరకూ నిజం, ఈ చిట్కాలు పాటించండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News