Vitamin D deficiency solution: సాధారణంగా అన్ని రకాల విటమిన్స్ , పోషకాలు శరీరానికి లభించినప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాము..  విటమిన్స్ లో ఏ విటమిన్ లోపం ఉన్నా సరే ఏదో ఒక రోగం మనల్ని చుట్టు ముడుతుంది. ప్రత్యేకించి విటమిన్ డి శరీరానికి చాలా అత్యవసరం అని చెప్పవచ్చు. అయితే ఈ విటమిన్ డి మనకు ఆహార పదార్థాల ద్వారానే కాకుండా ఉదయాన్నే సూర్యుడు నుండి వెలువడే కిరణాల ద్వారా కూడా మనకు లభిస్తుంది అని వైద్యులు చెబుతున్నారు. విటమిన్ డీ సప్లిమెంట్ల రూపంలో తీసుకోలేని వారు ఉదయాన్నే ఒక 20 నిమిషాలు ఎండలు కూర్చున్నా చాలు శరీరానికి కావలసిన విటమిన్ డి లభిస్తుందట. 
అయితే ముందుగా మన శరీరంలో విటమిన్ డి లోపించింది అని ఎలా తెలుసుకోవాలి ? ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి?  దీని పరిష్కారం ఏమిటి ?అనే విషయాలు ఇప్పుడు చూద్దాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విటమిన్ డి లోపం లక్షణాలు..


విటమిన్ డి లోపించినప్పుడు రోగనిరోధక వ్యవస్థ పై ప్రభావం చూపడమే కాదు.. ఎముకల బలహీనతకి కారణమవుతుంది.. శరీరంలో బోలు ఎముకల వ్యాధి, రికెట్స్ వంటి వ్యాధులు చుట్టుముడుతాయి.. ఇక ఎవరి శరీరంలో అయితే విటమిన్ డి తగినంత మోతాదులో ఉండదో .. వారు తరచూ జలుబు, దగ్గు, ఫ్లూ వంటి వ్యాధుల బారిన పడతారు... కండరాల బలహీనత కలుగుతుంది.. ముఖ్యంగా శక్తి తగ్గిపోతుంది.. ఎముకలు, కండరాలలో నొప్పి మొదలవుతుంది.. రోజురోజుకు సమస్య పెరుగుతుంది. విటమిన్ డి లోపించినప్పుడు మెదడు ఆరోగ్యం దెబ్బతింటుంది. మానసికంగా ఇబ్బందులు ఎదురవుతాయి.. విచారం, నిరాశ వంటి సమస్యలు కలుగుతాయి. న్యూరో ట్రాన్స్మిటర్లు పనితీరు నెమ్మదిస్తుంది.. డిప్రెషన్ , తలనొప్పి ఎక్కువగా వస్తాయి. 



విటమిన్ డి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..


విటమిన్ డి లోపించకుండా రోజూ ఉదయాన్నే 20 నిమిషాలు సూర్యరశ్మి తగిలేలా చూసుకోవాలి. 


నిత్యం పాలు, పాల ఉత్పత్తులను తప్పనిసరిగా తీసుకోవాలి. 


చేపలు,  గుడ్డులోని పచ్చ సోన,  పుట్టగొడుగులను తరచూ తింటే విటమిన్ డి లోపించకుండా ఉంటుంది.. అలాగే విటమిన్ డి కి సంబంధించిన పరీక్ష చేయించుకొని తద్వారా దీని లోపాన్ని సరైన సమయంలో గుర్తించవచ్చు.  ఒకవేళ వైద్యుడు సూచిస్తే విటమిన్ డి సప్లిమెంట్లను కూడా తీసుకోవచ్చు. ఇక ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే విటమిన్ డి లోపం వల్ల కలిగే సమస్యలను దూరం చేయవచ్చు


Also Read: Necklace At Garbage: చెత్తకుప్పలో వజ్రల హారం.. గంటల్లో కార్మికులు ఏం చేశారో తెలుసా?


Also Read: Security Denied Dhoti Farmer: లుంగీ కట్టారని అనుమతించని సెక్యూరిటీ.. మాల్‌ ఎదుట రైతుల ధర్నా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి