Dark Circles: ఆధునిక బిజీ లైఫ్‌లో ఎదురయ్యే వివిధ సమస్యల్లో ప్రధానమైంది కంటి కింద నల్లటి వలయాలు అంటే డార్క్ సర్కిల్స్ సమస్య. ముఖ్యంగా మహిళలకు చాలా ఇబ్బందిగా మారుతోంది. కేవలం రెండే రెండు హోమ్ రెమిడీస్ సహాయంతో ఆ డార్క్ సర్కిల్స్ దూరం చేయవచ్చు..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అందంగా ఉండాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ ఆధునిక పోటీ ప్రపంచంలో సరైన ఆహారం, సరైన నిద్ర లేక కంటి కింద నల్లటి వలయాలు ఏర్పడుతున్నాయి. అంటే డార్క్ సర్కిల్స్. ముఖ్యంగా మహిళలకు ఇది ప్రధాన సమస్యగా మారుతోంది. డార్క్ సర్కిల్స్ కారణంగా ముఖం అంద విహీనంగా మారుతోంది. యుక్త వయస్సుకే వృద్ధాప్య ఛాయలు కన్పిస్తుంటాయి. ముఖం కాంతి విహీనంగా మారిపోతుంది. కావల్సినంత నిద్ర లేకపోడవం, రక్త ప్రసరణ సరిగ్గా లేకపోవడం, అలసట కారణంగా కళ్ల కింద డార్క్ సర్కిల్స్ ఏర్పడుతున్నాయి. ఇవి కాకుండా ఇతర కారణాలు కూడా లేకపోలేదు. 


డార్క్ సర్కిల్స్ కారణాలు


పోషక పదార్ధాలు లోపించడం, ధూమపానం, ఎండలకు ఎక్స్‌పోజ్ అవడం వల్ల చర్మం దెబ్బతినడం లేదా జీన్స్ కూడా కంటి కింద డార్క్ సర్కిల్స్‌కు కారణాలంటున్నారు. వాతావరణం మారినప్పుడు తలెత్తే ఎలర్జిక్ రియాక్షన్లు, జలుబు, ముక్కు మూసుకుపోవడం వల్ల కూడా కంటి కింద నల్లటి వలయాలు ఏర్పడుతుంటాయి. మరోవైపు గంటల కొద్దీ సమయం కంప్యూటర్ల ముందు, మొబైల్ స్క్రీన్స్‌తో గడపడం వల్ల కూడా ఈ సమస్య తలెత్తుతుంది. 


డార్క్ సర్కిల్స్ అనేవి ముఖం అందాన్ని దెబ్బతీస్తాయి. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందేందుకు కొన్ని సహజ సిద్ధమన వస్తువులతో తయారైన ఔషధాన్ని వినియోగిస్తే అద్బుత ఫలితాలుంటాయి. 


డార్క్ సర్కిల్స్ ఇలా దూరం చేసుకోవచ్చు


మీ కంటి చుట్టూ నల్లగా మచ్చలేర్పడితే టీ బ్యాగ్ థెరపీ అద్భుతంగా పనిచేస్తుంది. దీనికోసం టీ తయారైన తరువాత టీ బ్యాగ్‌ను ఫ్రిజ్‌లో కూల్ చేయాలి. ఆ తరువాత ఆ టీ బ్యాగ్ కళ్లపై, కంటి చుట్టూ పెట్టుకోవాలి. 15-20 నిమిషాలసేపు ఇలా చేయడం వల్ల ఇందులో ఉండే కెఫీన్ నాళాలపై ప్రభావం చూపిస్తుంది. రక్త ప్రసరణ మెరుగుపర్చడం ద్వారా ఈ సమస్య తొలగిపోతుంది. అయితే క్రమం తప్పకుండా రోజుకు రెండుసార్లు చేయాల్సి వస్తుంది. 


మరో అద్భుతమైన మందు పాలు. పాలు అనేది చర్మాన్ని డీప్ క్లీన్ చేసి కాంతివంతం చేస్తుంది. డార్క్ సర్కిల్స్ సమస్యకు పాలు అద్భుతంగా పనిచేస్తాయి. దీనికోసం కోల్డ్‌మిల్క్ వినియోగించాలి. చల్లని పాలతో చర్మంపై మసాజ్ చేయాలి. దీనివల్ల డార్క్ సర్కిల్స్ పోవడమే కాకుండా చర్మానికి నిగారింపు వస్తుంది. ఫ్రిజ్‌లో ఉంచిన పాలు 2-3 స్పూన్స్ తీసుకుని కంటి చుట్టూ రాసి మాలిష్ చేయాలి. ఓ అరగంట తరవాత తడిపిన దూదితో క్లీన్ చేసుకోవాలి. అదే సమయంలో ప్రతిరోజూ ఎక్కువ నీళ్లు తాగడం, రాత్రి 8 గంటల కచ్చితమైన నిద్ర కూడా అవసరం. 


Also read; New Beard Style: ఏం చేసిన గడ్డం ఒత్తుగా రావడం లేదా.. అయితే ఇలా చేయండి..!



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook