Home remedies for gastritis: ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది తరచుగా అనారోగ్య సమస్యల మారిన పడుతూ ఉంటారు. ముఖ్యంగా బిజీ లైఫ్ కారణంగా చాలా మంది ఇంట్లో ఆహారాలకు బదులుగా స్ట్రీట్‌ ఫుడ్స్‌ను ఎక్కువగా తీసుకుంటూ ఉంటున్నారు. దీని కారణంగా తీవ్ర పొట్ట సమస్యల బారిన పడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే జీర్ణక్రియపై ప్రభావం పడే అవకాశాలు కూడా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీని కారణంగా కొందరిలో జీర్ణక్రియ కూడా దెబ్బతింటుంది. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా కొన్ని ఇంటి నివారణలు పాటించాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గ్యాస్‌ సమస్యలు పెరగడానికి కారణాలు:
చాలా మందిలో గ్యాస్‌ సమస్యలు రావడానికి ప్రధాన కారణాలు అతిగా వేయించి, అనారోగ్యకరమైన ఆహారాలు తినడం వల్లే వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా కొంత మంది ఆహారాలు సరైన సమయాల్లో తీసుకోవడం లేదు అయితే ఇలాంటి సమయాల్లో కూడా వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఇప్పటికి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా హోం రెమెడీస్‌ను వినియోగించాల్సి ఉంటుంది. 


Also Read: AP Politics: చంద్రబాబుతో మంచు మనోజ్ దంపతుల కలయిక, మతలబు అదేనా


గ్యాస్ట్రిటిస్ సమస్యల కోసం ఇంటి చిట్కాలు:
✤ పొట్టలో గ్యాస్‌ సమస్యలతో బాధపడేవారు అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం మానుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా తీసుకునే ఆహారాల్లో నిమ్మరసం వినియోగించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. 


✤ పొట్ట సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు తప్పకుండా అల్పాహారాల్లో సలాడ్‌ తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇందులో కూడా నిమ్మరం కలిపి తీసుకోవడం వల్ల కడుపు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.


✤ సోంపు నీరు కూడా పొట్టలో గ్యాస్‌ సమస్యకు ప్రభావంతంగా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. రాత్రంత సోంపును నీటిలో నానబెట్టి తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. 


✤ అల్లం, పుదీనా టీ తాగడం వల్ల కూడా గ్యాస్, కడుపు నొప్పి వంటి సమస్యల నుంచి చిటికెలో ఉపశమనం కలుగుతుందని ఆరోగ్య నిణులు తెలుపుతున్నారు. 


✤ తీవ్ర గ్యాస్ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ప్రతి రోజు మజ్జిగను తాగాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు అన్ని రకాల పొట్ట సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. 


✤ గ్యాస్‌ సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు జంక్, ఫాస్ట్ ఫుడ్స్‌ తినడం మానుకోవాల్సి ఉంటుంది. లేకపోతే మరింత తీవ్ర తరంగా మరే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 


(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


Also Read: AP Politics: చంద్రబాబుతో మంచు మనోజ్ దంపతుల కలయిక, మతలబు అదేనా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook