Horse Grams Benefits : ఎన్నో అద్భుత ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్న ఉలవలను రోజూ తింటే చాలా మంచిది. ఉలవలు నవధాన్యాలలో ఒకటి. ఒకప్పుడు ఎడ్లకు, గుర్రాలకు దాణాగా వాడే ఈ ఉలవలను పేదవారు మాత్రమే గుగ్గిళ్లుగానో లేదా చారుగానో చేసుకుని తినేవారు. అయితే దేశ వ్యాప్తంగా ఇప్పుడు తినే ఆహారపదార్ధాల్లో ఒకటిగా మారింది.  మ‌న దేశంలో వీటి పేరు తెలియ‌ని వారుండ‌రు. అంతేకాదు ఇప్పుడు ఉలవల(horse gram)తో చేసిన వంటకాలు అత్యంత ఖరీదైనవి.  ఇప్పుడు విందు వినోదాలలో వాడడం స్టేటస్‌ సింబల్‌ గా భావిస్తున్నారు.  అంతేకాదు తెలుగు వారికీ ఇప్పుడు ఉలవ గుగ్గిళ్ళు, ఉలవచారు ప్రియమైన వంటకాలుగా మారిపోయాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఉలవల్లో ఉండే పోషకాలు ఏంటంటే..
ఈ ఉలవల్లో ఉన్నన్ని పోషకాలు(Nutrients) మరే ఇతర ధాన్యంలోనూ ఉండవంటే అతిశయోక్తి కాదు. ఉలవలను చారుగా,  ఉడకపెట్టి గుగ్గిళ్ల గా కూడా తీసుకుంటారు. ప్రతి 100 గ్రాముల ఉలవ గుగ్గిళ్లలో 321 కేలరీలశక్తితోపాటు 22 గ్రాముల ప్రొటీన్లు, 57 గ్రాముల కార్బొహైడ్రేడ్లు, 287 మిల్లీగ్రాముల కాల్షియం, 311 మి.గ్రా. ఫాస్ఫర్‌సలతో పాటు బోలెడంత పీచుపదార్థమూ లభిస్తుంది. ఎదిగే వయసు పిల్లలకు ఉలవలకు మించిన మేలైన పోషకాహారం మరొకటి లేదు. 


Also Read: Coconut @ 6.5 lakhs: ఆ కొబ్బరికాయ ప్రత్యేకత ఏంటి, ఎందుకు 6.5 లక్షలకు అమ్ముడైంది


ఉలవల వల్ల కలిగే ప్రయోజనాలు..
* దీర్ఘకాలం పాటు అనారోగ్యంతో బాధపడి కోలుకొన్నవారు తరచూ ఉలవలను తీసుకొంటే త్వరగా జీర్ణ శక్తి మెరుగుపడుతుంది.
*ఊపిరితిత్తుల్లో పేరుకుపోయి, గట్టిపడిన కఫాన్ని పలుచబరచటంలో ఉలవలు చక్కగా ఉపయోగపడతాయి.
*అకారణంగా కన్నీరు కారటం, కళ్లల్లో పుసులు కట్టడం వంటి సమస్యలున్న వారు ఉలవలతో చేసిన అహారం తీసుకుంటే చక్కని గుణం కనిపిస్తుంది.
*ఉలవలు ఆకలిని పెంచుతాయి
*ఉలవలు ప్లీహ వ్యాధులతో బాధపడేవారికి మేలు చేస్తాయి.
*మూత్రంతో మంటతో ఇబ్బంది పడేవారు  ఒక కప్పు ఉలవచారుకి సమాన భాగం కొబ్బరి నీరు కలిపి తీసుకుంటుంటే ఉపశమనం లభిస్తుంది.
*మూత్రాశయంలో రాళ్లతో బాధపడేవారు ఈ ఉలవలు తింటే త్వరలోనే రాళ్లు కరిగి కిడ్నీల పనితీరు కూడా మెరుగుపడుతుంది.
*ఊబకాయానికి ఉలవలు మించిన ఔషధం లేనేలేదు.
*కప్పు ఉలవలకు నాలుగు కప్పులు నీళ్లు పోసి నానబెట్టి కుక్కర్‌లో ఉడికించి, ఆ ఉలవకట్టుకు చిటికెడు ఉప్పు కలిపి ఉదయం పరగడుపునే తీసుకుంటూ ఉంటే క్రమంగా సన్నబడతారు.
*త్వరగా బరువు తగ్గాలనుకునేవారికి(Weight Loss) ఉలవలు మంచి సహాయకారి. 
* నెలసరి రెగ్యులర్ గా రాని మహిళలు ఉలవలను తినే ఆహారంలో భాగంగా చేసుకోవడం వలన నెలసరి రాకపోవటం, క్రమం తప్పటం వంటి ఋతు సంబంధ సమస్యలు రావు.
*ఉలవలు దెబ్బతిన్న కాలేయాన్ని కోలుకునేలా చేస్తాయి.
*ఉల‌వ‌ల్లో ఐర‌న్‌, కాల్షియం, పాస్ఫ‌ర‌స్‌, ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉండడం వల్ల శ‌రీరానికి చ‌క్కని పోష‌ణ‌ను అందిస్తాయి.
*ఉలవల్లో ఫైబ‌ర్ ఉండ‌డం వ‌ల్ల ర‌క్తంలోని గ్లూకోజ్ స్థాయిలు, ర‌క్త‌పోటు నియంత్రణలో ఉంటాయి.


అయితే ఈ ఉలవలు ఎక్కువగా తీసుకోవడం వలన వేడి చేసే గుణం ఉంటుంది. కనుక ఉలవలు తిన్నరోజున తగినంత మజ్జిగ కూడా తీసుకుంటే వేడి చేయదు.  ఉలవలను నేరుగా తినేదాని కంటే ఉడికించి, మొలకలెత్తించి లేదా వేయించి పొట్టు తీసితిన్నప్పుడు పోషకాల విలువ మరింత పెరుగుతుంది. ఇక వీటిని ఉలవలను కనీసం 8 గంటల పాటు నానబెట్టడం మంచిది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook