Coconut @ 6.5 lakhs: ఇటీవల ఒకే ఒక బంగాళదుంప చిప్ లక్షల్లో అమ్ముడై ఆందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇప్పుడు అటువంటిదే మరో ఘటన. ఒకే ఒక కొబ్బరికాయ వేలంలో పలికిన ధర వింటే నోరెళ్లబెట్టడం ఖాయం. ఆ వివరాలేంటి, ఎక్కడ జరిగిందో తెలుసుకుందాం.
ఒక్కోసారి చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటుంటాయి. ఆలూ చిప్ లక్షల్లో కొనుగోలు చేయడం, నవారు మంచం నలభై లక్షలకు అమ్ముడవడం వంటి విచిత్రాల జాబితాలో ఇప్పుడు మరో ఘటన చేరింది. ఒకే ఒక కొబ్బరికాయను లక్షలు పోసి కొనుగోలు చేసిన ఘటన ఇది. కర్ణాటకలోని బాగల్ కోట్ జిల్లాలో జరిగిన ఈ ఘటన అందర్నీ ఆశ్చర్చపరుస్తోంది. ఎందుకంటే 20 రూపాయలో 50 రూపాయలో లేదా మహా అయితే 100 రూపాయలో విలువ చేసే కొబ్బరికాయను వేలంలో పోటీ పడి..ఏకంగా 6.5 లక్షలు పోసి కొన్నాడు ఓ వ్యక్తి.
కొబ్బరికాయ(Coconut) అనేది హిందూవులకు అత్యంత పవిత్రమైంది. పూజల్లో కొబ్బరికాయ లేకుండా ఏ పనీ జరగదు కూడా. కొబ్బరికాయ కొట్టే ఏ శుభకార్యమైనా ప్రారంభించడం ఆనవాయితీ. ఎంత సెంటిమెంట్ ఉన్నా మరీ ఇంతలానా. ఏకంగా 6 లక్షల 50 వేలు పెట్టి కేవలం ఒకే ఒక కొబ్బరికాయ కొనడమేంటనే సందేహాలు వస్తున్నాయి. కర్ణాటకలోని బాగల్ కోట్ జిల్లా చిక్కలకీ గ్రామంలో జరిగింది ఈ సంఘటన. ఈ గ్రామంలో 12వ శతాబ్దానికి చెందిన మలింగరాయ దేవుడి గుడి ఉంది. చాలా ప్రత్యేకమైంది. శక్తివంతమైనదిగా భక్తులు నమ్ముతారు. ఈ దేవాలయంలో పరమ శివుడి వాహనమైన నందిని మలింగరాయ అని పిలుస్తారు. ఈ విగ్రహం చాలా శక్తివంతమైందనేది ఓ నమ్మకం. అందుకే మలింగరాయుడి వద్ద ఓ కొబ్బరికాయ ఉంచి..ఏడాదిపాటు పూజలు చేస్తారు. ప్రతియేటా శ్రావణమాసం ముగింపులో ఈ కొబ్బరికాయను వేలం వేస్తారు. ఈ వేలంలో పోటీపడేందుకు చుట్టుపక్కలున్న ప్రముఖులు, వ్యాపారులు పోటీ పడుతుంటారు. గణేష్ చవితి సందర్భంగా బాలాసోర్ గణేష్ లడ్డూ వేలంపాటలో ఇలాగే జరుగుతుంది.
వేయి రూపాయలకు వేలం(Coconut Auction) ప్రారంభమైంది. చాలామంది ఉత్సాహంగా వేలంలో పాల్గొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కొబ్బరికాయ ధర లక్ష దాటింది. రెండు లక్షలు దాటింది. మూడు లక్షలు కూడా దాటేసింది. ఎలాగైనా ఆ కొబ్బరికాయను చేజిక్కించుకోవాలనే కోరికతో విజయపుర జిల్లాకు చెందిన మహావీర్ హర్కే అనే వ్యాపారి ఏకంగా 6.5 లక్షలు(Coconut at 6.5 lakhs)పెట్టి కొబ్బరికాయను కొనుగోలు చేశాడు. గతంలో ఎప్పుడూ ఈ కొబ్బరికాయ ధర గరిష్టంగా 15 వేలు దాటలేదు. ఈసారి మాత్రం ఎవ్వరూ ఊహించని రీతిలో 6.5 లక్షలు పలికింది. ఏడాదిపాటు విశేషపూజలు అందుకున్న కొబ్బరికాయ ఎవరి ఇంట్లో ఉంటే వారికి అన్నీ శుభాలే జరుగుతాయని ప్రతీతి. అంతా మంచే జరుగుతుందని నమ్ముతారు. అందుకే ఈ కొబ్బరికాయను దక్కించుకునేందుకు చాలామంది పోటీపడుతుంటారు.
Also read: EPFO : ఈపీఎఫ్ యూఏఎన్‌తో ఆధార్ నెంబర్ అనుసంధానానికి గడువు తేదీ పొడిగింపు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook