How Much Sleep Per Day Is Enough For a Person : ఒక వ్యక్తికి రోజుకు ఎన్ని గంటలు నిద్ర అవసరం అనేది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. అందులో వారి వయస్సు కూడా ఒకటి. అవును.. ఒక వ్యక్తికి ఎన్ని గంటల నిద్ర అవసరం అనేది వారి వయస్సు నిర్ణయిస్తుంది. వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ డేటా అధ్యయనం ప్రకారం ఏ వయస్సు ఉన్న వారికి ఎన్ని గంటల నిద్ర అవసరం అనేది ఇక్కడ తెలుసుకుందాం. ఈ కథనం చదవుతున్న మీకు రోజుకు ఎంత నిద్ర అవసరం, మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే వారికి ఎన్ని గంటల నిద్ర అవసరం అనేది తెలియాలంటే మనం ఇంకొంచెం డీటేల్డ్‌గా వెళ్లాల్సిందే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

0 నుండి 3 నెలల వయస్సు పసికందులు : 
0 నుండి 3 నెలల వయస్సు ఉన్న పసికందులకు నిద్ర ఎంతో అవసరం. ఎందుకంటే వారి శారీరక, మానసిక ఎదుగుదల ఎక్కువగా నిద్రలో ఉన్నప్పుడే జరుగుతుంది. ఆ వయస్సు వాళ్లు ఎంత ఎక్కువసేపు నిద్రపోతే అంత మంచిది. వాళ్లకు రోజుకు కనీసం 14 గంటల నుండి 17 గంటల నిద్ర అవసరం.


4 నెలల నుండి 12 నెలలు శిశువులు :
4 నుండి 12 నెలల వయస్సు కలిగిన శిశువుల శారీరక, మానసిక ఎదుగుదల నిద్రలోనే ఎక్కువగా వృద్ధి చెందుతుంది. ఈ శిశువులకు రోజుకు కనీసం 12 గంటల నుండి 16 గంటల నిద్ర అవసరం.


1 ఏడాది నుండి 2 ఏళ్ల శిశువులు : 
పసికందులతో పోల్చుకుంటే 1 ఏడాది నుండి 2 ఏళ్ల వయస్సు ఉన్న శిశువులకు నిద్ర కొంత తగ్గించుకోవచ్చు. వాళ్లకు రోజుకు కనీసం 11 గంటల నుండి 14 గంటల నిద్ర అవసరం.


3 ఏళ్ల నుండి 5 ఏళ్ల వయస్సు చిన్నారులు : 
3 ఏళ్ల నుండి 5 ఏళ్ల వయస్సు చిన్నారులకు రోజుకు కనీసం 10 గంటల నుండి 13 గంటల నిద్ర అవసరం. చిన్న పిల్లలు నిద్రపోతేనే వారి ఆరోగ్యానికి మంచిది. ఒకవేళ ఏదైనా కారణాలతో మీ పిల్లలు నిద్ర సరిగ్గా పోనట్టయితే, వెంటనే మీ పీడియాట్రిషయన్ ని సంప్రదించండి.


6 ఏళ్ల నుండి 13 ఏళ్ల వయస్సు పిల్లలు : 
6 ఏళ్ల నుండి 13 ఏళ్ల వయస్సు ఉన్న పిల్లలు ఎక్కువగా ఆటలతోనే అలసిపోతుంటారు. వీళ్లకు రోజుకు కనీసం 9 గంటల నుండి 11 గంటల నిద్ర అవసరం. 


14 ఏళ్ల నుండి 17 ఏళ్ల వయస్సున్న టీనేజ్ పిల్లలు : 
14 ఏళ్ల నుండి 17 ఏళ్ల వయస్సు ఉన్న టీనేజ్ పిల్లల నిద్ర విషయానికొస్తే.. వీళ్లకు రోజుకు కనిష్టంగా 8 గంటల నుండి 10 గంటల పాటు తప్పనిసరిగా నిద్రపోవాలి. 


18 ఏళ్ల నుండి 25 ఏళ్ల లోపు వయస్సున్న యువత : 
18 ఏళ్ల నుండి 25 ఏళ్ల లోపు వయస్సున్న యువత నిద్ర విషయానికొస్తే.. వీరికి రోజుకు కనిష్టంగా 7 గంటల నుండి 9 గంటల నిద్ర అవసరం అవుతుంది. 


ఇది కూడా చదవండి : Immunity In Monsoon Season: వర్షాకాలంలో జలుబు, జ్వరం లాంటి జబ్బులు రాకుండా ఉండాలంటే..


26 ఏళ్ల యువత నుండి 64 ఏళ్ల లోపు వయస్సున్న వారికి : 
26 ఏళ్ల యువతకైనా.. అలాగే 64 ఏళ్ల వృద్ధులకైనా రోజుకు కనిష్టంగా 7 గంటల నుండి 9 గంటల నిద్ర అవసరం అవుతుంది. ఇది ఒకరకంగా 18 ఏళ్ల నుండి 25 ఏళ్ల వారి నిద్రతో సమానంగా ఉంటుంది అని గుర్తుంచుకోవాలి. 65 ఏళ్ల తరువాత ఎవరికైనా రోజు మొత్తంలో కనీసం 7 గంటల నుంచి 8 గంటల నిద్ర అవసరం.


ఇది కూడా చదవండి : Eye Infections Solution: వర్షా కాలంలో కంట్లో ఇన్‌ఫెక్షన్స్ రాకుండా ఉండాలంటే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి