Immunity In Monsoon Season: వర్షాకాలంలో జలుబు, జ్వరం లాంటి జబ్బులు రాకుండా ఉండాలంటే..

Foods To Boost Your Immunity During Monsoon: వర్షాకాలంలో సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా ఎక్కువ అవడం వల్ల వచ్చే ఇన్ పెక్షన్స్, జబ్బుల నుంచి బయటపడాలంటే కేవలం పరిశుభ్రంగా ఉంటేనో లేక అపరిశుభ్రమైన ఆహారం, నీరు దూరం పెడితేనో సరిపోదు.. శరీరానికి బలాన్నిచ్చే చక్కటి ఆరోగ్యకరమైన ఆహారం కూడా తీసుకోవాలి. అదేంటి అనేది ఇప్పుుడు తెలుసుకుందాం.

Written by - Pavan | Last Updated : Jul 26, 2023, 10:47 AM IST
Immunity In Monsoon Season: వర్షాకాలంలో జలుబు, జ్వరం లాంటి జబ్బులు రాకుండా ఉండాలంటే..

Foods To Boost Your Immunity During Monsoon: వర్షాకాలంలో ఇన్‌ఫెక్షన్స్ సహజం. ఇన్‌ఫెక్షన్స్‌కి దారి తీసే సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా ఎక్కువ అవడమే అందుకు కారణం. ఈ ఇన్‌ఫెక్షన్స్ ఫలితంగానే వర్షా కాలంలో జబ్బుల బారిన పడే ప్రమాదం కూడా అంతే ఎక్కువగా ఉంటుంది. మనం ఎంత పరిశుభ్రంగా ఉన్నప్పటికీ.. మన చుట్టూ ఉండే పరిసరాలు ఎంత పరిశుభ్రంగా ఉన్నప్పటికీ..  అపరిశుభ్రమైన ఆహారం, నీరు ఎంత దూరం పెట్టినప్పటికీ.. మిగతా సీజన్స్ తో పోల్చుకుంటే.. వర్షా కాలంలో తరచుగా జబ్బుల బారిన పడటం జరుగుతుంటుంది. మరి ఈ సమస్యను దూరం చేయాలంటే కేవలం పరిశుభ్రంగా ఉంటేనో లేక అపరిశుభ్రమైన ఆహారం, నీరు దూరం పెడితేనో సరిపోదు.. శరీరానికి బలాన్నిచ్చే చక్కటి ఆరోగ్యకరమైన ఆహారం కూడా తీసుకోవాలి. అదేంటి అనేది ఇప్పుుడు తెలుసుకుందాం.

వర్షాకాలంలో మీరు తీసుకునే ఆహారంలో మంచి పౌష్టికారం ఉండేలా చూసుకోవాలి. అవేంటంటే..
అల్లం :
అల్లంలో యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. అలాగే అల్లంలో యాంటీఆక్సిడంట్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి ఒంట్లో వ్యాధి నిరోధక శక్తి పెంచేందుకు ఉపయోగపడతాయి. 

పసుపు : 
పసుపులో కర్‌క్యూమిన్ అనే మూలకం ఉంటుంది. ఈ మూలకం మీలో వ్యాధి నిరోధక శక్తి పెరిగేందుకు సహాయపడుతుంది. 

ఆకుపచ్చ కూరగాయలు :
ఆకుపచ్చటి కూరగాయల్లో విటమిన్స్, మినెరల్స్, ప్రోటీన్స్ అధిక మోతాదులో ఉంటాయి. ఇవి మీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మిమ్మల్ని జబ్బుల బారిన పడకుండా రక్షణని ఇస్తాయి.

గ్రీన్ టీ :
ప్రతీ రోజు మీ ఉదయాన్ని గ్రీన్ టీతో ఆరంభించండి. గ్రీన్ టీలో కేట్‌చిన్స్ అనే యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి మీలో వ్యాధి నిరోధక శక్తిని పెంచేలా చేసి మిమ్మల్ని అనారోగ్యంపాలు కాకుండా కాపాడతాయి. 

పొద్దున్నే బెర్రీ పండ్లు :
ప్రతీ రోజు పొద్దున్నే బ్రేక్‌ఫాస్ట్ సమయంలో మీరు తీసుకునే డైట్‌లో స్ట్రాబెర్రి వంటి బెర్రి పండ్లు ఉండేలా చూసుకోండి. ఇందులో విటమిన్స్, మినెరల్స్ ఎక్కువ మోతాదులో ఉంటాయి.

బాదాం :
ఉదయం పూట బాదాం పలుకులు తింటే మీ జ్ఞాపక శక్తి పెరగడంతో పాటు మీలో వ్యాధి నిరోధక శక్తి కూడా రెట్టింపవుతుంది. 

ఇది కూడా చదవండి : Eye Infections Solution: వర్షా కాలంలో కంట్లో ఇన్‌ఫెక్షన్స్ రాకుండా ఉండాలంటే..

ఆరెంజెస్, గ్రేప్‌ఫ్రూట్స్ : 
ఆరెంజెస్, గ్రేప్‌ఫ్రూట్స్ వంటి పండ్లలో విటమిన్ C పుష్కలంగా ఉంటుంది. విటమిన్ సీ మీ శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెరిగేలా చేసి మిమ్మల్ని ధృడంగా మార్చుతుంది అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బ్రేక్‌ఫాస్ట్ సమయంలో యొగర్ట్ తీసుకుంటే.. అది మీలో వ్యాధి నిరోధక శక్తిని పెరిగేలా చేస్తుంది.

ఇది కూడా చదవండి : Hairfall in Rainy Season: వర్షాకాలంలో జుట్టు బాగా రాలుతుందా ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News