Steam: ఆవిరి పట్టడం రెండు రకాలు. తుమ్ము, దగ్గు ఉన్నప్పుడు పట్టే ఆవిరి ఓవైపు..ఫేసియల్ సమయంలో ఆవిరి పట్టడం మరోవైపు . ఇంతకీ ఆవిరి ఎంతసేపు పట్టాలనేది తెలుసా..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


సాధారణంగా రొంప ( Cold ), దగ్గు ( Cough ) ఉన్నప్పుడు ఆవిరి పట్టడమనేది ఎప్పట్నించో అలవాటులో ఉన్న ప్రక్రియ. అదే సమయంలో ఫేసియల్ ( Facial ) ప్రక్రియలో కూడా అదే ఆవిరి కీలకపాత్ర పోషిస్తుంది. బ్యూటీపార్లర్‌లలో ఫేసియల్ చేసేటప్పుడు ముఖానికి ఆవిరి పట్టడమనేది చాలా ముఖ్యం. మరి ఈ ఆవిరి ఎంతసేపు పట్టాలి ?  ఎలా పట్టాలి ? అసలు ఆవిరి పట్టడం వల్ల కలిగే ప్రయోజనాలేంటనేది తెలుసుకోవాలి.


ముఖచర్మం ( Face skin ) చాలా సున్నితమైంది. అందుకే ఆవిరి ( Steaming ) మరీ దగ్గరగా ఉండకూడదు. షవర్‌బాత్ సమయంలో నీరు ఎంత దూరం నుంచి పడుతుందో..అంత దూరం నుంచి ఆవిరి చర్మానికి తగలాలి. లేకపోతే చర్మం సహజత్వం, సున్నితత్వాన్ని కోల్పోయే ప్రమాదముంది. 


ఐదు నిమిషాలకు మించి ఆవిరి పట్టడం మంచిది కాదు. ఎందుకంటే అందరి చర్మతత్వం ఒకేలా ఉండదు. అందుకే ఆవిరి ( Steam ) పట్టడమనేది ఒకేలా ఉండకూడదు.ఎక్కువ సేపు ఆవిరి పట్టడజం వల్ల చర్మంలోని పోర్స్ తెరుచుకుని..సహజ‌సిద్ధంగా నూనె స్రవించే గ్రంథులు పొడిబారిపోతాయి. ఫలితంగా చర్మం త్వరగా ముడతలు పడటానికి ఆస్కారముంది. 


ఆవిరి పట్టిన తరువాత క్లీన్సర్‌ ( Cleanser ) తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. దాంతో పోర్స్‌లో ఉన్న మలినాలు తొలగిపోతాయి. ఆ తరువాత పొడిగా ఉన్న మెత్తని టవల్‌తో ముఖాన్ని తుడుచుకోవాలి. ఒకవేళ చర్మం పొడిబారినట్టుగా అన్పిస్తే..ముఖం శుభ్రపర్చుకున్నాక మాయిశ్చరైజర్ వాడటం మంచిది. చర్మం తత్వానికి అనుగుణంగా ట్రీట్‌మెంట్ ఇచ్చే నిపుణులతోనే ఫేసియల్ లేదా స్టీమ్ పట్టించుకోవడం మంచిది.


Also read: Red ants chutney : ఎర్ర చీమల చట్నీ తినేవాళ్లు చూశారా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook