Red ants chutney : ఎర్ర చీమల చట్నీ తినేవాళ్లు చూశారా

Red ants chutney : ప్రపంచంలో విభిన్న ప్రాంతాల్లో ఆహార అలవాట్లు వివిధ రకాలుగా ఉంటాయి. మరి చీమల్ని తినడం గురించి విన్నారా..ఆశ్యర్యంగా ఉందా. నిజమే..ఎర్రచీమలతో  చట్నీ చేసుకుని ఇష్టంగా తింటారు. 

Last Updated : Jan 4, 2021, 03:47 PM IST
Red ants chutney : ఎర్ర చీమల చట్నీ తినేవాళ్లు చూశారా

Red ants chutney : ప్రపంచంలో విభిన్న ప్రాంతాల్లో ఆహార అలవాట్లు వివిధ రకాలుగా ఉంటాయి. మరి చీమల్ని తినడం గురించి విన్నారా..ఆశ్యర్యంగా ఉందా. నిజమే..ఎర్రచీమలతో  చట్నీ చేసుకుని ఇష్టంగా తింటారు. 

భారతదేశంలో గిరిజనుల ఆహార అలవాట్లు ( Tribals habits ) వింతగా ఉంటాయి. మనమైతే చీమల్ని చూడగానే..దూరం జరగడం కానీ, ఊడ్చేయడం గానీ చేస్తుంటాం. కానీ గిరిజనులు మాత్రం చీమల్ని చూడగానే పండుగ చేసుకుంటారు. కేవలం ఆహార పదార్ధంగానే కాదు ఔషధంగా కూడా పరిగణిస్తారు. ఎర్రచీమల్ని పచ్చడి ( Red ants chutney ) చేసుకుని తింటారు. ఈ చట్నీతో ఫ్లూ, దగ్గు, జలుబు, శ్వాస ఇబ్బందులు తొలగిపోతాయనేది గిరిజనులు చెబుతున్న మాట. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ( Corona virus ) ‌ను కూడా ఎర్రచీమల చట్నీతో తరిమేయవచ్చని అంటున్నారు. తమ ప్రతిపాదనల్ని పరిశోధకులు పెడచెవిన పెట్టారని ఓ ఇంజనీర్ కోర్టులో పిల్ కూడా వేశాడు.

ఒడిశా ( Odisha ) కు చెందిన ఇంజనీర్, పరిశోధకుడైన నయాధర్ పడియాల్ పిల్ దాఖలు చేశాడు. కరోనా చికిత్సలో భాగంగా సాంప్రదాయ ఎర్ర చీమల చట్నీపై అధ్యయనం చేయాలని ప్రతిపాదన పంపినా పట్టించుకోలేదని నయాధర్ ఆందోళన వ్యక్తం చేశాడు. ఆయన వేసిన పిటీషన్‌ను స్వీకరించిన ఒడిశా హైకోర్టు..ఎరుపు చీమల పచ్చడి కరోనాను నయం చేయడంలో సహాయ పడుతుందా లేదా చెప్పాలని ఆయుష్ మంత్రిత్వ శాఖ ( Ayush ministry ) ను ఆదేశించింది. 

ఒడిశా, ఛత్తీస్ గఢ్ ప్రాంతాల్లోని గిరిజనులు ఎర్రచీమల్ని పట్టుకుని..అందులో పచ్చిమిర్చి ఇతర పదార్ధాల్ని ఉపయోగించి చట్నీ చేసి తినడం అనాదిగా వస్తున్న అలవాటు. కరోనా చికిత్సలో ఈ చట్నీ అద్భుతంగా పనిచేస్తుందనేది వీరి వాదన.

Also read: Snow Places: మంచు ప్రదేశాలకు వెళ్లే ముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి!

Trending News