Home Cleaning Tips: ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తున్నారంటే ఇల్లు శుభ్రంగా చేసుకొని వాళ్లకు రకరకాల వంటలు చేసి పెడతాం. అయితే ఇంటి శుభ్రంతో పాటు సింకు నల్లాలు కూడా తళతళా మెరిపించాలని అనుకుంటాం. అయితే ఇది మాత్రం చాలా కష్టంగా మారుతుంది. ఇంట్లో ఉండే వస్తువులతో తుప్పు పట్టిన నల్లాలను ఎలా కొత్త మెరుపుదానం తీసుకురావాలో ఈరోజు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాను నాను ఇంటి బాత్రూం లేదా సింకు ట్యాప్ లు తుప్పు పడుతుంటాయి. లేకపోతే మబ్బుగా మారిపోతాయి వీటిని తరచూ క్లీన్ చేస్తున్నా కానీ ఒక్కోసారి అవే మెరిపించలేకపోతుంటాం. ఇంటి వస్తువులతో ఎలా నల్లాలను తళతళ మెరిపించాలో తెలుసుకుందాం


వెనిగర్..
ఒక్కోసారి ఇంటి టాప్లకు తుప్పు పట్టి పోతాయి ఇలాంటి టాప్లను వెనిగర్ తో రస్ట్‌ను తొలగించుకోవచ్చు. వెనిగర్, ఉప్పు రెండు కలిపి ఒక గుడ్డ లేదా స్పాంజ్ సహాయంతో తుప్పు పట్టిన ట్యాప్ ని రబ్ చేయాలి. ఇలా చేయడం వల్ల తుప్పు పట్టిన ట్యాప్ ను తళ తళా మెరిసిపోతాయి.


ఇదీ చదవండి: ప్రతిరోజు 2 పిస్తాలు తింటే డాక్టర్‌తో పనే ఉండదు.. ఈ ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం


నిమ్మరసం..
నిమ్మరసంతో కూడా ఈజీగా తుప్పు పట్టిన ట్యాప్‌లను  మెరిపించవచ్చు ఎందుకంటే ఇందులో ఆసిడక్ ఎలిమెంట్ ఉంటుంది. ఇది తప్పును నీటి మరకలను ఈజీగా తొలగిస్తుంది. నిమ్మరసం ఎలాంటి వస్తువులను క్లీన్ చేయడానికి ఒక వరమని చెప్పాలి. బాత్రూం ట్యాప్ నిమ్మ తొక్కలు లేదా నిమ్మరసంతో కాసేపు రుద్దాలి. ఆ తర్వాత క్లాత్ తో క్లీన్ చేస్తే శుభ్రం చేస్తే నీటి మరకలు తొలగిపోతాయి.


బేకింగ్ సోడా..
బేకింగ్ సోడా కూడా మీ నీటి మరకలు ఉన్న నల్లాలను తళ తళా మెరిపిస్తాయి. మూడు టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడా తీసుకొని అందులో నిమ్మరసం పిండి ఈ పేస్ట్ స్క్రబ్ లాగా నల్లాలని శుభ్రం చేసుకోవాలి. ఈ ఇలా చేయడం వల్ల టాప్ లు కొత్త వాటిలా మెరిసిపోతాయి.


ఇదీ చదవండి: ఈ మాస్క్‌ ఒక్కటి జుట్టుకు పట్టించారంటే వద్దన్నా ఆరోగ్యంగా పెరుగుతూనే ఉంటుంది..


డిష్ వాష్..
నల్లాలను కొత్త వాటిలో మెరిపించడానికి ఇంట్లో ఉన్న డిష్ వాష్ కూడా ఉపయోగించవచ్చు. సోప్ లేదా లిక్విడ్ డిష్ వాష్ ను ఉపయోగించి ఒక సిక్స్ స్క్రబ్బర్ తో టాప్లను శుభ్రం చేయాలి. ఇది ప్రతి వారానికి ఒకసారి చేసిన నల్లాలు కొత్త వాటిలో మెరిసిపోతాయి ఇలా బాత్రూం టాప్స్ హ్యాండిల్స్ ఉపయోగించి క్లీన్ చేయొచ్చు.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి