Aloe Vera Hair Mask: కలబందతో హెయిర్ మాస్క్ తయారు చేసుకోవడం వల్ల ఇది ఎఫెక్ట్ గా పని చేస్తుంది. జుట్టుని పొడుగ్గా పెరిగేలా ప్రోత్సహిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మ సమస్యలు రాకుండా నివారించి జుట్టును డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది. సౌందర్య నిపుణుల అభిప్రాయం ప్రకారం చర్మ సమస్యలు రాకుండా కలబందను అప్లై చేసుకుంటే ఎఫెక్టీవ్ రెమిడిగా సహాయపడుతుంది. అంతేకాదు జుట్టు పొడుగ్గా, ఆరోగ్యంగా పెరగడానికి కలబందని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.
కలబంద మాస్క్..
కలబంద జెల్ తీసుకొని అందులో కాస్త కొబ్బరి నూనె లేదా ఆలివ్ నూనె వేసి జుట్టుకు బాగా మర్దన చేసుకోవాలి. జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేసుకోవాలి. ఒక అరగంట తర్వాత సాధారణ నీటితో హెయిర్ వాష్ చేసుకుంటే సరిపోతుంది.
ఆముదం నూనె..
ఇక కలబందని ఆముదం నూనెను సమపాళ్లలో తీసుకొని బాగా మిక్స్ చేసి దీని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు బాగా అప్లై చేసి మర్దన చేయాలి. ఓ అరగంట తర్వాత దీని సాధారణ నీటితో హెయిర్ వాష్ చేసుకుంటే జుట్టు అందంగా కనిపిస్తుంది.
ఎసెన్షియల్ ఆయిల్స్..
లావెండర్ ఆయిల్ లేదా రోజ్మెరీ ఆయిల్ ని కలబందతో కలిపి మిక్స్ చేసి తలకు పట్టించడం వల్ల జుట్టు కుదుళ్ల నుంచి దృఢంగా పెరుగుతుంది. ముఖ్యంగా ఇది స్కాల్ప్ ఆరోగ్యానికి సహాయపడుతుంది. ఈ పేస్టు తలకు అప్లై చేసి అరగంట తర్వాత తలస్నానం చేసుకోవాలి.
ఇదీ చదవండి: సన్‌ఫ్లవర్ సీడ్స్ తింటున్నారా? అయితే, మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు..
యోగార్టు..
యోగార్టు అలోవెరా తీసుకొని బాగా పేస్ట్ మాదిరి తయారు చేసుకోవాలి. దీని కుదుళ్లకు బాగా అప్లై చేసి ఓ 45 నిమిషాలు అలాగే ఉంచాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో తల స్నానం చేసుకోవాలి. ఇది వారానికి రెండు సార్లు ప్రయత్నిస్తే జుట్టు ఆరోగ్యంగా దృఢంగా పెరుగుతుంది జుట్టుకు జీవం పోసినట్లుగా కనిపిస్తుంది.
ఇదీ చదవండి: సండే మటన్ కర్రీని ఇలా ధాబా స్టైల్‌లో చేసుకుని తినండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..
గుడ్లు..
గుడ్ల తో కూడా హెయిర్ మాస్క్ తయారు చేసుకోవచ్చు దీనికి గుడ్డు తెల్ల బాగానే తీసుకొని అందులో అలోవెరా జెల్ కూడా కలిపి మంచి పేస్ట్ మాదిరి తయారు చేసుకోవాలి. దీని జుట్టు అంతటికి పట్టించి ఓ అరగంట అలాగే ఆరనివ్వాలి ఆ తర్వాత సాధారణ నీటితో హెయిర్ వాష్ చేసుకోవాలి ఈ రెమెడీని కూడా వారానికి రెండు సార్లు ప్రయత్నిస్తే జుట్టు దృఢంగా పొడుగ్గా మెరుస్తూ కనిపిస్తుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి