How To Control Cholesterol: ఈ డికాషన్‌తో చెడు కొలెస్ట్రాల్ 9 రోజుల్లో మెత్తగా కరగడం ఖాయం.!
How To Control Cholesterol Naturally In 9 Days: శరీరంలోని రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా వ్యాయామాలతో పాటు పలు ఇంటి చిట్కాలను పాటించాల్సి ఉంటుంది.
How To Control Cholesterol Naturally In 9 Days: రక్తంలో కొలెస్ట్రాల్ పెరగడం కారణంగా రక్త నాళాలలో రక్తం గడ్డకట్టడం ప్రారంభమవుతుంది. దీని కారణంగా రక్త ప్రసరణకు ఆటంకం కలిగి రక్త ప్రసరణలో వివిధ మార్పులు సంభవిస్తాయి. దీంతో నొప్పులు ప్రారంభం మొదవులవుతాయి. అంతేకాకుండా దీని ప్రభావం గుండెపై కూడా పడుతుంది. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవడం శరీరానికి చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీని కోసం వంట గదిలో లభించే అల్లంతో పాలు పలు ఔషధ గుణాలు కలిగిన పలు రకాల పదార్థాలను తీసుకోవాల్సి ఉంటుంది. వీటిని ప్రతి రోజు వినియోగించడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పరిమాణాలు సులభంగా తగ్గుతాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
కొలెస్ట్రాల్ తగ్గించడానికి అల్లం ఎలా సహాయపడుతుంది:
అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్ గుణాలు లభిస్తాయి. కాబట్టి దీనిని ప్రతి రోజూ వినియోగించడం వల్ల అధిక రక్తపోటుతో పాటు, అధిక కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి సులభంగా శరీర బరువును కూడా తగ్గిస్తుంది.
పచ్చి అల్లం ఇలా నమలండి:
ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో పచ్చి అల్లం నమలడం వల్ల కొలెస్ట్రాల్ సులభంగా తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అల్లంతో పాటు పచ్చి వెల్లుల్లిని కూడా నమలవచ్చు. ఈ రెండింటిలోనూ యాంటీ ఆక్సిడెంట్లు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి సులభంగా రక్తాన్ని శుద్ధి చేస్తుంది.
అల్లం నీరు డికాషన్:
అల్లంతో తయారు చేసిన డికాషన్ ప్రతి రోజూ తాగడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా దగ్గు, జలుబు వంటి సీజనల్ వ్యాధుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. అయితే ఖాళీ కడుపుతో ప్రతి రోజూ తాగడం వల్ల కొలెస్ట్రాల్ పరిమాణాలు కూడా తగ్గుతాయి.
వ్యాయామం తప్పనిసరి:
ప్రతి రోజూ అల్లం టీ తాగి వ్యాయామాలు చేయడం వల్ల చెడు కొలెస్ట్రాల్ సులభంగా కరుగుతుంది. అంతేకాకుండా పొట్ట సమస్యలు కూడా సులభంగా తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ తీసుకోవాల్సి ఉంటుంది.
Also Read: Gannavaram: గన్నవరంలో ఉద్రిక్తం.. టీడీపీ ఆఫీసుపై ఎమ్మెల్యే వంశీ వర్గీయులు దాడి
Also Read: Income Tax Return 2023: పన్ను చెల్లింపుదారులకు ముఖ్య గమనిక.. ఐటీఆర్ ఫారమ్‌లో కీలక మార్పులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి