How To Control Uric Acid In 9 Days: ప్రస్తుతం చాలా మంది యూరిక్ యాసిడ్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. శరీరంలోనికి రక్తంలో యూరిక్‌ యాసిడ్‌ స్థాయిలు అతిగా పెరగడం కారణంగా యూరిక్‌ యాసిడ్‌ సమస్యలు వస్తున్నాయి. అయితే ఈ సమస్యల కారణంగా పాదాలు, కీళ్ళు, వేళ్లలో స్ఫటికాలు ఏర్పడి.. తీవ్ర నొప్పులకు దారి తీస్తుంది. నొప్పులు, వాపులను ఎంత సులభంగా ఉపశమనం పొందితే అంత మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. లేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి ఎలాంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

యూరిక్ యాసిడ్ తగ్గించడానికి ఇంటి చిట్కాలు:
1. శరీర బరువును నియంత్రించుకోవాలి:

యూరిక్ యాసిడ్ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా శరీర బరువును నియంత్రణలో ఉంచుకోవాలి. లేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యలు రావడమేకాకుండా గౌట్ మంటలు పెరిగే ఛాన్స్ కూడా ఉంది. 


2. విటమిన్ సి లోపం:
రక్తంలో యూరిక్ యాసిడ్ పరిమాణం పెరగడానికి ప్రధాన కారణాలు శరీరంలో విటమిన్ సి లోపం పెరగడం కారణంగానే ఇలాంటి సమస్యలు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. పోషకాలు అధిక పరిమాణంలో ఉండే ఆహారాలు ప్రతి రోజు తినడం వల్ల ఈ యూరిక్‌ యాసిడ్‌ స్థాయిలను నియంత్రించుకోవచ్చు. కాబట్టి ప్రతి రోజు నారింజ, నిమ్మకాయలను తప్పనిసరిగా తీసుకోవాలి.


Also Read:  Agent Twitter Review : ఏజెంట్ ట్విట్టర్ రివ్యూ.. హిట్ కొట్టిన అయ్యగారు


3. తీపి పదార్థాలకు దూరంగా ఉండండి:
యూరిక్ యాసిడ్ స్థాయి అతిగా పెరిగితే తీపి అధికంగా ఉండే పదార్థాలకు దూరంగా ఉండడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ సమస్యలతో బాధపడేవారు అతిగా తిపి పదార్థాలను తీసుకుంటే  గౌట్ ప్రమాదం మరింత పెరిగే అవకాశాలున్నాయి. 


4. ప్యూరిన్ గల ఆహారాలు తినొద్దు:
అధిక ప్యూరిన్ కంటెంట్ ఉన్న ఆహారాలు అతిగా తినడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. యూరిక్ యాసిడ్ సమస్యను తగ్గించుకోవడానికి తప్పకుండా ఆహారంలో పాల ఉత్పత్తులు, గింజలు, పండ్లు, కూరగాయలు, బంగాళదుంపలను తీసుకోవాల్సి ఎంటుంది. 


5. ఆల్కహాల్‌న తీసుకోవద్దు:
ఆల్కహాల్ తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ సమస్యలు పెరగడమేకాకుండా తీవ్ర అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక వ్యాధులు కూడా రావొచ్చు. కాబట్టి యూరిక్ యాసిడ్ సమస్యలతో బాధపడేవారు ఆల్కహాల్‌ అతిగా తీసుకోవడం మానుకోవాల్సి ఉంటుంది.


(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


Also Read:  Agent Twitter Review : ఏజెంట్ ట్విట్టర్ రివ్యూ.. హిట్ కొట్టిన అయ్యగారు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook