Poha Recipe:  పోహా అనేది ఉల్లిపాయలు, సుగంధ ద్రవ్యాలతో ఉడికించిన ఆహారం. ఇది ఆరోగ్యకరమైనవిగా చెబుతుంటారు. పోహాను తెలుగులో అటుకులు ఉప్మా అని కూడా పిలుస్తారు. ఈ అటుకుల ఉప్మాను ఎంతో ఇష్టంగా తింటారు చాలా మంది. దీని బ్రేక్‌ఫాస్ట్‌గా కూడా తీసుకోవచ్చు. పోహాను చాలా తక్కువ సమయంలోనే తయారు చేసేసుకోవచ్చు. దీని కోసం ఎక్కువగా ఖర్చు పెట్టి కూరగాయలు తీసుకోవాల్సిన అవసరం లేదు. కేవలం పది నిమిషాల్లో ఈ పోహను తయారు చేసుకోవచ్చు.  రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అందించే పోహా తయారీ విధానం ఎలాగో మనం తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పోహాకి కావల్సిన పదార్థాలు:


ఒక కప్పు అటుకులు, కొద్దిగా కొత్తిమీర, రెండు కరివేపాకు ఆకులు, రెండు టేబుల్‌ స్పూన్స్‌ నిమ్మరసం, 1/2 టీస్పూన్ జీలకర్ర, 1/2 టీస్పూన్ వెల్లుల్లి , 1/4 టీస్పూన్ పసుపు, 
మూడు పచ్చిమిర్చి, 1/2 ఉల్లిపాయ, రెండు టేబుల్ స్పూన్స్ పల్లీలు, మూడు  టేబుల్ స్పూన్స్ పచ్చి బఠాణి , ఉప్పు


పోహా తయారీ చేసుకోవడం ఎలా:


ముందుగా అటుకులను నీళ్ళుతో శుభ్రం చేసుకోవాలి. తర్వాత నీళ్ళు పిండి తీసుకోవాలి. స్టవ్‌పై పెనం పెట్టి నూనె వేడి చేసుకోవాలి. ఇందులోకి జీలకర్ర, పల్లీలు, పచ్చి మిర్చి, పసుపు, వెల్లుల్లి ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి. ఆ తర్వాత ఉలిపాయ ముక్కలు, పచ్చి బఠాణిలు వేసి కాసేపు వేయించుకోవాలి. ఇప్పుడు కడిగి పక్కన పెట్టుకున్న అటుకులను అందులో వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు  నిమ్మరసం అంతా అటుకుల్లో బాగా కలిసేలా కలుపుకోవాలి. కొత్తి మీర గార్నిష్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. దీన్ని మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌గా కూడా తీసుకోవచ్చు. దీని పిల్లలకు బ్రేక్‌ఫాస్ట్‌గా ఇవ్వడం వల్ల ఎంతో మేలు చేస్తుంది. దీని వల్ల కడుపు నిండిన భావన ఉంటుంది. పెద్దలకు టైమ్‌ లేనప్పు ఈ పోహా తయారు చేసుకొని తినవచ్చు. మీరు కూడా ఈ పోహాను మీ ఇంట్లో తయారు చేసుకొని ట్రై చేస్తే మళ్లీ మళ్లీ ఇదే తినాలని అంటారు.


Also Read: Parenting Tips : మీరు చెప్పినమాట మీ పిల్లలు అస్సలు వినట్లేదా.. అయితే ఇలా చేసిచూడండి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter