Hibiscus Tea Benefits: మందార పువ్వుల టీ .. దీన్ని తీసుకుంటే అనారోగ్య సమస్యలకు చెక్..!
Hibiscus Tea: చాలా మంది పెరటి మొక్కల్లో హైబిస్కస్ మొక్కని పెంచుతూ ఉంటారు. దీనిని మందారం అని పిలుస్తారు. మందారం పువ్వుతో ఎన్నో లభాలు ఉన్నాయి. దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అనే విషయంపై మనం ఇప్పుడు తెలుసుకుందాం..
Hibiscus Tea: మనం ఇంట్లో పెంచుకునే పూల మొక్కలల్లో మందార మొక్క ఒకటి. మందారం పువ్వులు ఎన్నో రకాలుగా మార్కెట్‌లో లభిస్తాయి. ఇవి చూడానికి ఎంతో అందంగా ఉంటాయి. అయితే ఈ పువ్వులు కేవలం పూజలకు, అలంకారణ కాకుండా మన ఆరోగ్యని కూడా పెంచుతాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.
మందార పూలు అందంగా ఉండడంతో పాటు అనేక ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. వీటిని జుట్టు పెరుగుదలలో వాడుతూ ఉంటారని వైద్యులు చెబుతున్నారు. మందార పువ్వులను ఉపయోగించడం వల్ల జుట్టు అందంగా, ఒత్తుగా పెరుగుతుంది. అయితే కేవలం జుట్టు పెరుగుదలలోనే కాకుండా మన ఆరోగ్యానికి కూడా మందార పూలు ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. మందార పువ్వులతో తయారు చేసి టీని తీసుకోవడం వల్ల ఆరోగ్యాన్ని పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
మందార పువ్వులతో టీని ఎలా తయారు..
మందార టీ ని తయారు చేసుకోవడానికి ముందుగా ఒక గ్లాస్ మందారం పువ్వులు, ఒక టీ స్పూన్ నల్ల మిరియాల పొడి, ఒక గ్రామ శొంఠి పొండిని, 3 గ్రాముల అర్జున పొడి వేసి మరిగించాలి. ఇలా తయారు చేసుకున్న టీని 12 వారాల పాటు తాగడం వల్ల శరీరంలో కఫ, పిత్త దోషాలు తొలగిపోతాయి ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.
Also read: Hair Fall Home Remedies: జుట్టు రాలడాన్ని తగ్గించే బియ్యం మిశ్రమం చిట్కా..ఇది రాస్తే చాలు..
ఒత్తిడి తగ్గుదమే కాకుండా ప్రశాంతత లభిస్తుంది. మైగ్రేన్ తలనొప్పి ఉండే వారు ఈ మందారం టీ తాగడం వల్ల ఉపశమనం పొందవచ్చు. ఈ టీని తాగడం వల్ల జీర్ణ సమస్యలు దూరమవుతాయి.
చిగుళ్ల వాపు, చిగుళ్ల నుంచి రక్తం కారడం వంటి సమస్యలు తగ్గుతాయి. ఈ టీతో చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ లెవల్స్ కూడా తగ్గుతాయి. ఈ విధంగా మందార పువ్వులతో టీని తయారు చేసి తీసుకోవడం వల్ల మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
Also read: White Hair: చిన్న వయసులోనే తెల్ల జుట్టు రావడానికి కారణాలు.. మానుకోవాల్సిన అలవాట్లు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి