How To Make Mozzarella Cheese at Home Without Rennet: పిజ్జా లేదా శాండ్‌విచ్, బర్గర్ తయారు చేసే క్రమంలో తప్పకుండా చీజ్‌ వాడతారు. ఎందుకంటే ఇదే నోటికి రెట్టింపు రుచిని అందిస్తుంది. చిన్న పిల్లకు ఎక్కువగా జున్ను తయారు చేసిన ఆహార పదార్థాలను ఇస్తూ ఉంటారు. ఇవీ నోటికి రుచిని ఇవ్వడమే కాకుండా శరీరాన్ని దృఢంగా చేసేందుకు సహాయపడతాయి. ప్రస్తుతం చాలా మంది తల్లులు చిన్న పిల్లలకు జున్నుకు బదులుగా మోజారెల్లా చీజ్ కలిగిన ఆహారాలను ఇస్తున్నారు. అయితే బయట లభించే ఈ చీజ్‌లు చాలా వరకు రసాయనాలతో తయారు చేసినవి మాత్రమే లభిస్తున్నాయి. కాబట్టి వీటికి బదులుగా మోజారెల్లా చీజ్‌ను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అయితే ఈ చీజ్‌ ఎలా తయారు చేసుకోవాలో, దీనికి కావాల్సిన పదార్థాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మోజారెల్లా చీజ్ తయారీకి కావలసినవి పదార్థాలు:
✻ 3 లీటర్ల వెన్న కలిగిన పాలు
✻ 1 కప్పు వెనిగర్
✻ 25 గ్రాముల ఉప్పు


Also Read: Viral Video: ఇదేందయ్యా ఇది..నేనెప్పుడూ చుడలే..! పామును తిన్న జింక, వీడియో వైరల్


మొజారెల్లా చీజ్ తయారు చేసుకునే విధానం:
✺ ముందుగా ఒక లోతైన పాత్రను తీసుకోవాల్సి ఉంటుంది. 
✺ ఆ తర్వాత పాత్రలో మూడు లీటర్ల పాలు పోసి బాగా మరిగించుకోవాలి. ఇలా చేసిన తర్వాత పాలను పక్కకు పెట్టి చల్లార్చాలి. 
✺ పాలు కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు..వెనిగర్ వేసి సుమారు అరగంట పాటు పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది. 
✺ అరగంట తర్వాత పాలు సరైన క్రమంలో ఉన్నాయో తప్పకుండా తనిఖీ చేసుకోవాలి.
✺ మస్లిన్ క్లాత్ సహాయంతో పాలను ఫిల్టర్‌ చేయాలి. 
✺ ఇలా ఫిల్టర్‌ చేసిన తర్వాత పాలు గడ్డలా తయారవుతుంది.  
✺ ఇప్పుడు మరో బౌల్‌ పెట్టి..పాలు గడ్డలు, ఉప్పు వేసి బాగా మరిగించాలి.
✺ ఇప్పుడు మీరు ఈ పెరుగుల తయారైన పన్నీర్‌ తీసి పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.
✺ ఆ తర్వాత ఒక గుడ్డలో పన్నీర్‌ ముక్కలను వేసి.. గట్టిగా చుట్టి ఉంచాలి. 
✺ ఇలా గట్టిగా చుట్టి పెడితే చిన్న బాల్స్‌లా తయారవుతుంది. ఆ తర్వాత ఫ్రిజ్‌లో ఉంచి మీకు ఇష్టమైన ఆహారాలపై మోజారెల్లా చీజ్‌ను వినియోగించవచ్చు.


Also Read: Viral Video: ఇదేందయ్యా ఇది..నేనెప్పుడూ చుడలే..! పామును తిన్న జింక, వీడియో వైరల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook