White Hair: ఈ 3 ఇంటి చిట్కాలతోనే తెల్ల వెంట్రుకల సమస్యకు ఈజీగా చెక్ పెట్టొచ్చు తెలుసా?
How To Cover White Hair: తెల్ల వెంట్రుకలు కనిపించకుండా ఉండటానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తారు. దీనికి అనేక ఉత్పత్తులు కూడా కొనుగోలు చేస్తారు. జుట్టు పై ప్రయోగం చేస్తారు. అయితే, కొన్ని కెమికల్ అధికంగా ఉండే ఉత్పత్తులతో సైడ్‌ఎఫెక్ట్స్ తప్పవు. ఇంటి చిట్కాలతో ఈజీగా తెల్ల వెంట్రుకల సమస్యకు చెక్ పెట్టొచ్చు.
How To Cover White Hair: తెల్ల వెంట్రుకలు రాకుండా ఉండటానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తారు. ఎందుకంటే తెల్ల వెంట్రుకలో ముఖం అంద విహీనంగా కనిపిస్తుంది. దీనికి అనేక కెమికల్ ఉత్పత్తులు ఉపయోగిస్తారు. వీటిని తరచూ తలపై ఉపయోగించడం వల్ల సైడ్‌ఎఫెక్ట్స్ చూపిస్తాయి. వీటితో మరింత తెల్లు వెంట్రుల సమస్య పెరిగిపోతుంది. తరచూ కలర్ ఇతర హానికర పదార్థాలు జుట్టుపై ఉపయోగించాల్సి ఉంటుంది.
కొంతమంది తెల్ల వెంట్రుకలు కనిపిస్తే చాలు వాటిని పట్టి లాగేస్తారు. కానీ, ఇలా చేయడం వల్ల స్కాల్ప్ ఆరోగ్యం దెబ్బతింటుంది. అంతేకాదు తెల్ల వెంట్రుకలు తొలగించడం వల్ల మరిన్ని పెరుగుతాయని అంటారు. సాధారణంగా తెల్ల వెంట్రుకలు వచ్చినప్పుడు తల దురదగా అనిపిస్తుంది. అందుకే వాటిని తొలగించేస్తారు. కానీ,వాటిని లాగేయడం వల్ల తల అంతటా దురదగా ఉంటుంది. ఇంట్లో ఉండే కొన్ని వస్తువులతో తెల్ల వెంట్రుకలకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. అవి ఏంటో తెలుసుకుందాం.
రోజ్మెరీ..
రోజ్మెరీ జుట్టు పెరుగుదలకు రోజ్మెరీ ఎంతగానో ఉపయోగపడుతుంది. వీటిలో యాంటీ మైక్రోబ్రియల్ గుణాలు కలిగి ఉంటాయి. ఇది సహజసిద్ధంగా జుట్టును నల్లగా మారుస్తుంది. రోజ్మెరీ జుట్టుకు ఉపయోగించడం వల్ల జుట్టు బాగా పెరుగుతుంది. ఇది కుదుళ్ల ఆరోగ్యానికి కూడా తోడ్పడుతుంది. రోజ్మెరీ మన హెయిర్ కేర్ రొటీన్ యాడ్ చేయడం వల్ల మీ జుట్టు నేచురల్‌గా మెరుస్తూ ఆరోగ్యంగా పెరుగుతుంది.
ఇదీ చదవండి: కేవలం ఈ 2 చాలు.. జుట్టు అస్సలు పట్టుకుని లాగినా ఊడదు..!
ఉసిరి..
ఉసిరికాయ ఈ సీజన్‌లో బాగా లభిస్తుంది. కార్తీక మాసం ప్రత్యేకం ఉసిరి దీపం. అయితే, ఉసిరికాయతో కూడా తెల్ల జుట్టు సమస్యకు క్షణాల్లో చెక్ పెట్టొచ్చు. కొబ్బరి నూనెలో ఉసిరికాయ రసం కలిసి జుట్టుకు అప్లై చేయాలి. ఓ గంట తర్వాత సాధారణ షాంపూతో తలస్నానం చేయాలి. అంతేకాదు ఉసిరిపొడి కూడా మార్కెట్లో విరివిగా లభిస్తుంది. ఇది అన్నీ సీజన్లలో అందుబాటులో ఉంటుంది. ఉసిరికాయ పొడిని కొబ్బరి నూనెలో కలిపి జుట్టు అంతటికీ అప్లై చేయాలి. దీన్ని ఓ గంటపాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత సాధారణ షాంపూతో తలస్నానం చేయాలి. కేవలం గోరువెచ్చని నీటితో మాత్రమే జుట్టును కడగాలని గుర్తుంచుకోండి.
ఇదీ చదవండి: 30 రోజులు ఉల్లి, వెల్లుల్లి తినడం మానేస్తే.. మీ శరీరంలో జరిగే మార్పులు ఇవే..!
కాఫీతో కడగండి..
మీ జుట్టు ఏ కెమికల్ ఉపయోగించకుండానే నల్లగా కనిపించాలంటే కాఫీ కూడా ఎఫెక్టీవ్ రెమిడీ. కాఫీలో కెఫీన్ ఉంటుంది. సాధారణంగా కాఫీని ఉదయం సాయంత్రం తాగే అలవాటు ఉంటుంది. ఇందులో ఆరోగ్య ప్రయోజనాలు కూడా పుష్కలంగా ఉంటాయి. కాఫీతో జుట్టు కడగడం వల్ల మీ జుట్టుకు పోషకాలు అందుతాయి. ఇందులోని కెఫీన్ జుట్టుకు ఎంతో మేలు చేస్తుంది. కాఫీ పొడిని జుట్టు కడిగిన తర్వాత ఓ అరగంట తర్వాత నీళ్లలో కలిపి జుట్టును కడగండి. ఇలా చేయడం వల్ల జుట్టు నేచురల్‌గా ఆరోగ్యంగా నల్లగా మెరుస్తూ కనిపిస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.