Chandan ubtan facepack: ఎండలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో ముఖం మొత్తం ట్యాన్‌ అవ్వడంతోపాటు జీవం లేనట్లుగా మారిపోతుంది. ముఖంపై అనేక ఉత్పత్తులను వాడినా అవి కూడా కారిపోయే పరిస్థితులు ఉన్నాయి. అయితే, ఈ ఎండలకు సరైన చర్మ జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఇంట్లో ఉండే వస్తువులతో ఫేస్‌ ప్యాక్‌ వేసుకోవాలి. ఎక్కువ కెమికల్‌ ఉండే పదార్థాలను వాడకపోవడమే మేలు. చందనం ఎన్నో ఏళ్లుగా సాంప్రదాయ సౌందర్య ఉత్పత్తుల్లో ఉపయోగిస్తున్నారు. దీంతో ముఖం చంద్రబింబం మెరిసిపోతుంది. ఇందులో చర్మానికి పోషణనిచ్చే గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇంట్లోనే చందనంతో ఉబ్తాన్ ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కావలసిన పదార్థాలు..
శనగపిండి
 పచ్చిపాలు 
పసుపు 
చందనం పొడి
తేనె
నిమ్మరసం
 బాదం పొడి


ఇదీ చదవండి: కొబ్బరినూనెలో ఈ ఒక్కటి కలిపి అప్లై చేయండి.. మీ జుట్టు వద్దన్నా పెరుగుతూనే ఉంటుంది..


చందనం ఉబ్తాన్ తయారు చేయడానికి ఈ పదార్థాలు అన్నిటిని ఒక బౌల్ లో వేసుకోవాలి. చందనంపూడి ఆన్లైన్ స్టోర్స్ లో అందుబాటులోనే ఉంటాయి. రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి, చందనం పొడి వేసి బాగా కలుపుకోవాలి. ముఖానికి గ్లో పెరగాలంటే అందులో పసుపు కూడా చిటికెడు వేసుకోవాలి. పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ముఖాన్ని కాంతివంతం చేస్తుంది. బాదం పొడితో ముఖాన్ని ఎక్స్‌ఫోలియేట్ అవుతుంది. ఇందులో మాయిశ్చరైజ్ గుణాలు ఉంటాయి. వీటన్నిటికీ పాలు వేసి కలుపుకోవాలి లేదంటే రోజ్ వాటర్ కలిపి పేస్ట్ మాదిరి తయారు చేసుకోవాలి. లేదంటే ఇందులో యోగర్ట్‌ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఉబ్తాన్ ఫేస్ ప్యాక్ రెడీ అయినట్లే ఇందులో కొన్ని చుక్కల నిమ్మరసం వేసుకొని ముఖం, మెడ భాగంలో బాగా అప్లై చేసుకోవాలి. ముఖాన్ని సర్క్యూలర్ మోషన్ లో మసాజ్ చేస్తూ ఉండాలి. స్క్రబ్ చేస్తున్నట్టు మృదువుగా రుద్దాలి. ముఖం ఒక 20 నిమిషాల పాటు ఆరిన తర్వాత ఫేస్ వాష్ చేసుకొని ఆ తర్వాత గోరువెచ్చని నీటితో ఫేస్ వాష్ చేయాలి. మాయిశ్చరైజేషన్ లాక్ అవ్వడానికి వెంటనే మాయిశ్చరైసర్ రాసుకోవాలి.


ఇదీ చదవండి: కర్పూరాన్ని బట్టల్లో ఎందుకు ఉంచాలో తెలుసుకోండి..


చందనంతో తయారు చేసే ఫేస్‌ ప్యాక్‌ తో ముఖానికి చంద్ర బింబం వంటి ముఖం పొందుతారు. అయితే, ఈ ఫేస్‌ ప్యాక్ మాత్రమే కాదు మండే ఎండలకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాదు ఇది ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తున్నప్పుడు ముఖానికి స్కాఫ్ కట్టుకోవాలి. ఎండతో ముఖం ట్యాన్‌ పేరుకోకుండా ఉండటానికి సన్‌స్క్రీన్‌ లేనిదే బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. (Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి