Dryfruits Laddu: డ్రైఫ్రూట్స్ లడ్డూ.. రుచికరం ఎంతో ఆరోగ్యకరం ఇలా తయారు చేసుకోండి..
Dryfruits Laddu Recipe: డ్రైఫ్రూట్స్ ఆరోగ్యానికి మంచివి. ఇవి రుచికరంగా కూడా ఉంటాయి. వీటిని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ కూడా బూస్ట్ అవుతుంది. దీన్ని ఉదయం లేదా సాయంత్ర స్నాక్ మాదిరి తీసుకోవచ్చు.
Dryfruits Laddu Recipe: డ్రైఫ్రూట్స్ ఆరోగ్యానికి మంచివి. ఇవి రుచికరంగా కూడా ఉంటాయి. వీటిని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ కూడా బూస్ట్ అవుతుంది. దీన్ని ఉదయం లేదా సాయంత్ర స్నాక్ మాదిరి తీసుకోవచ్చు. డ్రైఫ్రూట్స్ వివిధ వంటలో వాడతాం. వీటితో వెజ్ నాన్ వెజ్ వంటలు కూడా వాడతాం. అయితే, వీటితో రుచికరమైన లడ్డూలు కూడా తయారు చేసుకోవచ్చు. ఇవి ఎక్కువ రోజుల పాటు నిల్వ కూడా ఉంటాయి. ముఖ్యగా ఇవి సాయంత్ర ఆకలి వేసినప్పుడు తీసుకుంటే ఆరోగ్యంగా కూడా ఉంటారు. అంతేకాదు ఈ లడ్డూలను చక్కెర వాడకుండానే తయారు చేసుకుంటాం కాబట్టి రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇవి పిల్లలు కూడా ఇష్టపడి తింటారు. ఈ ఆరోగ్యకరమైన డ్రై ఫ్రూట్స్ లడ్డూలను చేసి పెడితే మీ కుటుంబ సభ్యులు కూడా ఎంతో ఇష్టంగా ఉంటారు కూడా..
డ్రైఫ్రూట్స్ లడ్డూ తయారీ విధానం..
ఒక ప్యాన్ తీసుకుని అందులో ఒక స్పూన్ నెయ్యి వేసి వేడి చేసుకోవాలి.
ఆ తర్వాత అందులో ఒక కప్పు బాదం, అరకప్పు జీడిపప్పు, పావుకప్పు పిస్తా కట్ చేసుకొని దోరగా వేయించుకోవాలి.
ఆ తర్వాత వాటిని స్టవ్‌పై నుంచి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పావుకప్పు అదే ప్యాన్‌లో ఎండుద్రాక్ష, ఫిగ్స్ కూడా వేసి వేయించాలి. ఇప్పుడు వాటిని కూడా తీసి పక్కన పెట్టుకుని చల్లరానివ్వాలి. ఆ తర్వాత గుమ్మడిగింజలు 3 టీస్పూన్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్ 3 టీస్పూన్స్, నువ్వులు 2 టీస్పూన్స్ ఒక చెంచా గసగసాలు, చెంచా కొబ్బరి తురుము కూడా వేసి రోస్ట్ చేసుకోవాలి. అవి కాస్త క్రిస్పీగా మారాక స్టవ్‌పై నుంచి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ డ్రైఫ్రూట్స్ మిక్చర్ అంతా ఓ మిక్సీలోకి తీసుకుని బరకగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇదీ చదవండి: కలబంద రసం ప్రతిరోజు తాగడం వల్ల మీ శరీరానికి 8 ఆరోగ్య ప్రయోజనాలు..
ఇప్పుడు ఓ పెద్ద కడాయి తీసుకుని అందులో రెండు టీస్పూన్స్ నెయ్యి వేసి పావుకిలో ఖర్జూరాలు కూడా వేసి చిన్నమంటపై వేయించాలి. ఓ ఐదు నిమిషాల తర్వాత అవి మెత్తగా మారతాయి. ఆతర్వాత వాటిని మ్యాష్ చేయాలి. చల్లారనివ్వాలి ఇప్పుడు డ్రైఫ్రూట్స్ పొడి ఈ ఖర్జూరం పేస్ట్‌ను వేసి లడ్డూలు కట్టుకోవాలి. అంతే రుచికరం, ఆరోగ్యకరమైన డ్రైఫ్రూట్స్ లడ్డూలు రెడీ అయినట్లే.. వీటిని ఓ డబ్బాలో వేసి స్టోర్ చేసి పెట్టుకోవచ్చు.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
ఇదీ చదవండి: టమాటాతో 10 నిమిషాలు ఇలా చేస్తే .. రెండురోజుల్లో మంగుమచ్చలు మాయం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి