Aloe vera juice benefits: కలబంద రసం ప్రతిరోజు తాగడం వల్ల మీ శరీరానికి 8 ఆరోగ్య ప్రయోజనాలు..

Aloe vera juice Health benefits:  కలబంద జ్యూస్ మంచి రిఫ్రేషింగ్ డ్రింక్. ఇందులో విటమిన్స్, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. కలబంద రసంలో విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ ఇ, విటమిన్ బి కాంప్లెక్స్ కూడా ఉంటుంది.

Written by - Renuka Godugu | Last Updated : Jun 2, 2024, 05:23 PM IST
Aloe vera juice benefits: కలబంద రసం ప్రతిరోజు తాగడం వల్ల మీ శరీరానికి 8 ఆరోగ్య ప్రయోజనాలు..

Aloe vera juice Health benefits:  కలబంద జ్యూస్ మంచి రిఫ్రేషింగ్ డ్రింక్. ఇందులో విటమిన్స్, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. కలబంద రసంలో విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ ఇ, విటమిన్ బి కాంప్లెక్స్ కూడా ఉంటుంది. కొన్ని నివేదికల ప్రకారం కలబంద రసాన్ని ప్రతిరోజు తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీంతో కలిగే 8 ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.

హైడ్రేషన్..
కలబంద రసాన్ని మీ డైట్ లో చేర్చుకోవడం వల్ల మన శరీరానికి కావలసిన హైడ్రేషన్ అందుతుంది. కలబందలో నీటి శాతం అధికంగా ఉంటుంది, ఇది మన శరీరంలోని విష పదార్థాలను బయటికి తరిమేస్తుంది. కలబంద రసంలో నీరు అధికంగా ఉండటం వల్ల రోజంతా శరీరం హైడ్రేటెడ్ గా ఉంటుంది.

చర్మ ఆరోగ్యం..
కలబంద రసంలో విటమిన్ ఇ, విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు ఇందులో ఖనిజాలు కూడా ఉంటాయి. దీంతో మన చర్మం హైడ్రేటెడ్ గా ఉంటుంది. కలబంద రసం మనలో మన చర్మంపై కొల్లాజన్ ఉత్పత్తికి తోడ్పడుతుంది. అంతేకాదు ఇది మన ముఖంపై పేర్కొన్న వ్యర్ధాలను తొలగిస్తుంది.

మెరుగైన జీర్ణక్రియ..
అంతేకాదు కలబంద రసాన్ని ప్రతిరోజు తీసుకోవడం వల్ల పేగు ఆరోగ్యానికి తోడ్పడుతుంది. ఎందుకంటే కలబంద రసంలో ఎంజైమ్స్ ఆహారం విడగొట్టడంలో కీలకపాత్ర పోషిస్తుంది. ఇది జీర్ణ క్రియ మెరుగు చేసి మంచి పేగు ఆరోగ్యానికి తోడ్పడుతుంది.

ఇదీ చదవండి: శనగపిండితో మచ్చలేని ముఖం.. నిత్యయవ్వనం.. డ్రై స్కిన్‌ యాక్నేకు చెక్..

పంటి ఆరోగ్యం..
కలబంద రసంలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు ఇందులో ఉండే విటమిన్స్ యాంటీ ఆక్సిడెంట్ పళ్లు పాడవ్వటాన్ని నిరోధిస్తుంది పళ్ళను ఆరోగ్యవంతం చేస్తుంది.

కంటి ఆరోగ్యం..
కొన్ని నివేదికల ప్రకారం కలబంద రసాన్ని మనం డైట్లో చేర్చుకోవడం వల్ల ఇందులోని బేటా కెరోటిన్ యాంటీ ఆక్సిడెంట్ కంటి చూపుని మెరుగు చేస్తుంది. కంటి సంబంధిత వ్యాధులు రాకుండా కాపాడుతుంది.

రోగ నిరోధక శక్తి..
కలబంద రసం వల్ల ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్సు, ఖనిజాలు ఇవి మన ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తాయి. సీజనల్‌ జబ్బులు రాకుండా కాపాడుతాయి .అందుకే ప్రతిరోజు మీరు కలబంద రసాన్ని తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఇలా కలబంద రసం డైట్లో చేర్చుకోవడం వల్ల ఇమ్యూనిటీ వ్యవస్థ బలపడుతుంది.

ఇదీ చదవండి: అవిసె గింజలు ఇలా వాడితే మీ జుట్టు ఊడనే ఊడదు.. పొడుగ్గా పెరుగుతుంది..

కాలేయ ఆరోగ్యం..
అంతేకాదు కొన్ని నివేదికల ప్రకారం కలబంధ రసాన్ని తాగడం వల్ల లివర్ డిటాక్సిఫికేషన్ ప్రక్రియకు తోడ్పడుతుంది .ఎందుకంటే ఇందులో ఫైటో న్యుట్రియేంట్స్ లివర్ పని తీరుకు మెరుగు చేస్తాయి విషపదార్థాలను లివర్ నుంచి బయటికి పంపించడంలో సహాయపడతాయి.

బరువు నిర్వహణ..
కలబంద రసం డైట్లో చేర్చుకోవడం వల్ల ఇందులోని లోక్యాలరీస్ తో బరువు నియంత్రిస్తుంది ఇందులో విటమిన్ బి మెటబాలిజం రేటును పెంచుతుంది దీంతో కొవ్వులు తగ్గిపోతాయి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News