Reduce Diabetes And Cholesterol: మనం ప్రతిరోజు వంటల్లో ఉపయోగించే పదార్థాలు ఆహారంలో రుచి పెంచడమే కాకుండా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందులో వెల్లుల్లి ఒకటి. దీని మనం ఎక్కువగా పోపులోకి వాడుతుంటాము.  అంతేకాకుండా ఆయుర్వేదంలో వెల్లుల్లికి ప్రత్యేక స్థానం ఉంది. వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఫంగల్‌ గుణాలు ఉంటాయి.  అయితే ప్రతిరోజు వెల్లుల్లి తినడం వల్ల శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌, డయాబెటిస్‌ దూరం అవుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్లలతో పాటు జింక్‌, కాపర్‌, క్యాల్షియం, ఐరన్‌ అధికంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో కొన్ని మార్పులు జరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.  ప్రతిరోజు మూడు వెల్లుల్లి ముక్కులు నేరుగా తినడం వల్ల అద్భుతమైన లాభాలు కలుగుతాయి. నేరుగా వెల్లుల్లి తినడానికి ఇష్టం లేకపోయిన ఇలా యచేయడం వల్లషుగర్‌, చెడు కొలెస్ట్రాల్‌, గుండె సంబంధిత సమస్యలు తగ్గుతాయని వైద్యులు చెబుతున్నారు. అంతేకాకుండా వెల్లుల్లి తినడం వల్ల అధిక బరువు  తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 


వెల్లుల్లి ఎలా తినడం వల్ల కీళ్లు, బరువు ఎలా తగ్గుతాయి?


వెల్లుల్లి తినడం జీర్ణక్రియవ్యవస్థ మెరుగుపడుతుంది. దీని వల్ల పేగుల్లో ఉండే వ్యర్థపదాలు తొలుగుతాయి. ఆకలిని అదుపు చేయడంలో కూడా వెల్లుల్లి సహాయపడుతుంది దీని వల్ల ఆహారం ఎక్కువగా తినాలనే భావన  కలగకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా చర్మ సమస్యలను తగ్గించడంలో కూడా ఇవి ఎంతో మేలు చేస్తాయి.  మొటిమలు, మచ్చలు ఉన్నవారు కూడా దీని తినడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి.  వెల్లుల్లిని నేరుగా తినడానికి కష్టంగా ఉంటే తేనెను కలుపుకొని తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది. అలాగే హార్ట ఎటాక్‌ వంటి సమస్యలు రాకుండా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. కీళ్ల నొప్పులతో బాధపడేవారు ప్రతిరోజు రెండు వెల్లుల్లి ముక్కలు తినడం వల్ల ఈ సమస్యనుంచి ఉపశమనం పొందవచ్చు. 


వెల్లుల్లిని ఆహారంలో ఎలా చేర్చుకోవాలి: 


1. ముడి వెల్లుల్లి:


సలాడ్‌లు: తరిగిన వెల్లుల్లిని మీ సలాడ్‌లకు జోడించండి.
సాంబార్, రసం: వంట చేసేటప్పుడు వెల్లుల్లి రెబ్బలను జోడించండి.
టోస్ట్: తయారు చేసిన టోస్ట్‌పై వెల్లుల్లి రెబ్బను రుద్ది తినండి.


2. వేయించిన వెల్లుల్లి:


తైలు: వెల్లుల్లిని నూనెలో వేయించి, ఆ తైలును వేరే వంటకాలలో వాడండి.
పచ్చడి: వెల్లుల్లిని వేయించి, పచ్చడి చేసుకోవచ్చు.
నూడుల్స్, ఫ్రైడ్ రైస్: వెల్లుల్లిని వేయించి, నూడుల్స్ లేదా ఫ్రైడ్ రైస్‌కు జోడించండి.


3. పేస్ట్ చేసిన వెల్లుల్లి:


మరినేడ్స్: మాంసం లేదా చేపలను మరీనేట్ చేసేటప్పుడు వెల్లుల్లి పేస్ట్‌ను వాడండి.
సాస్‌లు: వివిధ రకాల సాస్‌ల తయారీలో వెల్లుల్లి పేస్ట్‌ను ఉపయోగించండి.
డ్రెస్సింగ్స్: సలాడ్ డ్రెస్సింగ్‌లకు వెల్లుల్లి పేస్ట్‌ను జోడించండి.


4. వెల్లుల్లి పొడి:


సూప్స్: సూప్‌లకు రుచి కోసం వెల్లుల్లి పొడిని జోడించండి.
బేకింగ్: బ్రెడ్, కేక్‌లు వంటి వాటికి రుచి కోసం వెల్లుల్లి పొడిని ఉపయోగించండి.
వెజిటేబుల్ డిష్‌లు: వివిధ రకాల కూరగాయల వంటకాలలో వెల్లుల్లి పొడిని వాడండి.


గమనిక:


ఈ విధంగా వెల్లుల్లి తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. అయితే మీకు ఏదైనా ఆరోగ్యసమస్యలు ఉంటే ముందుగా వైద్యుడిని సంప్రదించడం మంచిది. 


Also Read: Red King Kobra: ఎరుపు రంగులో నాగుపాము వయ్యారాలు.. చూస్తే మతిపోతది


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter