Skin Care with Fruits:  పోషకాల పరంగా పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మంచివి. అయితే తరతరాలుగా పండ్లను సౌందర్య ఉత్పత్తుల్లో కూడా వినియోగిస్తున్నారు.  ఇందులో ఉండే విటమిన్స్ మినరల్స్, ఎంజైన్స్  ఆరోగ్యంతో పాటు సౌందర్యపరంగా కూడా అనేక ఉపయోగాలు ఉన్నాయి. వీటిని ముఖానికి జుట్టుగా నేరుగా అప్లై చేసుకోవచ్చు. ముఖ్యంగా అరటి పళ్ళు, యాపిల్స్, ఆరెంజ్, బొప్పాయి ఎక్కువగా సౌందర్య ఉత్పత్తుల్లో వినియోగిస్తారు. ఈరోజు మనం ప్రముఖ సౌందర్య నిపుణురాలు షహనాజ్‌ హుస్సేన్ గ్లోయింగ్ స్కిన్ కోసం రెమిడీస్ తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బొప్పాయి..
బొప్పాయిలో పపెయిన్ ఉంటుంది ఇది ఒక రకమైన ఎంజైమ్. ఇది బ్యూటీ ట్రీట్మెంట్ కి తోడ్పడుతుంది బొప్పాయి మన చర్మం పై పేరుకున్న డెడ్‌ స్కిన్‌ ని తొలగించడానికి ఉపయోగపడుతుంది. పండిన బొప్పాయి గుజ్జును ముఖం, ఇతర శరీర భాగాలపై రాసుకోవచ్చు. దీంతో స్కిన్ మృదువుగా మారుతుంది.  డ్రై స్కిన్ సమస్యలకు, పగిలిన మడమలకు బొప్పాయి మంచి రెమిడీ. పండిన బొప్పాయిని పెరుగులో కలిపి ముఖం ఇతర భాగాలకు అప్లై చేసుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి


యాపిల్..
యాపిల్స్ లో పెక్టిన్, టానిన్లు ఉంటాయి. ఇవి స్కిన్ ని టైట్ గా చేయడంలో సహాయపడతాయి స్కిన్ టోన్ కూడా మెరుగు పరుస్తాయి. ముఖ్యంగా యాపిల్స్ బ్లడ్ సర్క్యులేషన్స్ కి కూడా తోడ్పడతాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు త్వరగా వృద్ధాప్య ఛాయలు రాకుండా కాపాడుతాయి . యాపిల్స్ ని గ్రేట్ చేసి ముఖంపై ప్యాక్ మాదిరి వేసుకోవచ్చు లేదా ఆపిల్ జ్యూస్ ను నేరుగా ఫేస్ పై అప్లై చేసి ఒక 20 నిమిషాల తర్వాత సాధారణ నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి


ఇదీ చదవండి: ఈ హెయిర్‌ ప్యాక్‌తో నెలలో మీ జుట్టు నడుం వరకు పెరుగుతుంది..


మామిడి..
మామిడిపండ్లు విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. ఇందులో విటమిన్ ఏ, సీ, ఫాస్ఫరస్, పొటాషియం కాల్షియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి.ఇది స్కిన్ కి పునర్జీవనం ఇస్తుంది స్కిన్ రంగుని మెరుగుపరుస్తుంది. మామిడిపండు త్వరగా వృద్ధాప్య ఛాయలు ముఖంపై కనిపించకుండా చేస్తుంది అంతేకాదు, మామిడిపండు చర్మం జుట్టును మృదువుగా మారుస్తుంది. జుట్టును కుదుళ్ల నుంచి బలపరుస్తుంది మామిడిపండు గుజ్జును ఫ్రూట్ ప్యాక్లా ముఖానికి జుట్టుకు అప్లై చేసుకోవచ్చు.


ఇదీ చదవండి: భగ భగ మండే ఎండలకు గోలి సోడా.. తయారీ విధానం


ఆరెంజ్..
ఆరెంజ్ కూడా లెమన్ మాదిరి విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది ఆరెంజ్ గుజ్జుతో ముఖానికి ఫేస్ మాస్క్ వేసుకోవచ్చు సన్ ట్యాన్ సమస్యతో బాధపడే వారికి బెస్ట్ రెమెడీ. ఆరెంజ్ గుజ్జు ముఖానికి రాసుకోవడం వల్ల స్కిన్ రంగు మెరుగు పడుతుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి