Immunity Boosting Foods: మారుతున్న సీజన్‌లో రకరకాల వ్యాధులు వస్తున్నాయి. ఈ సీజనల్‌ వ్యాధులకు వ్యతిరేకంగా పోరాడటానికి ఇమ్యూనిటీ వ్యవస్థ బలంగా మారుతుంది. కొన్ని రకాల ఆహారాలు ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తాయి. ఈ సీజన్‌లో మీ డైట్లో తప్పనిసరిగా చేర్చుకోవాలి. ఆ ఆహారాలు ఏంటో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విటమిన్ సీ పండ్లు..
సిట్రస్‌ పండ్లు ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తాయి. ముఖ్యంగా ఆరెంజ్‌, గ్రేప్‌ఫ్రూట్‌, నిమ్మకాయ వంటి సిట్రస్‌ పండ్లను డైట్లో చేర్చుకోవాలి. విటమిన్‌ సీ శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు కలిగి ఉంటాయి. ఇది ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తాయి. అంతేకాదు తెల్లరక్తకణాల ఉత్పత్తికి ప్రేరేపిస్తాయి.  ఇవి సీజనల్‌ వ్యాధులకు వ్యతరేకంగా పోరాడతాయి. ఈ ఆహారాలు డైట్లో చేర్చుకోవడం వల్ల రొంప, జులుపు సమస్యలు తగ్గించేస్తాయి. 


వెల్లుల్లి...
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం వెల్లుల్లిలో ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో మెడిసినల్‌ గుణాలు పుష్కలంగా ఉంటాయి. వేళ సంవత్సరాల నుంచి ఆయుర్వేదంలో ఉపయోగిస్తార వెల్లుల్లిలో అల్లీసిన్‌ ఉంటుంది. ఇందులో యాంటీ మైక్రోబ్రియల్‌, ఇమ్యూనిటీ బూస్టింగ్‌ ప్రభావం ఉంటుంది. వెల్లుల్లి డైట్లో చేర్చుకోవడం వల్ల ఫ్లూ, జలుబుల నుంచి దూరంగా ఉండొచ్చు.


ఇదీ చదవండి: ఈ టీ జాయింట్ పెయింట్స్‌ను తగ్గించే ఎఫెక్టీవ్ రెమిడీ.. మ్యాజికల్ బెనిఫిట్స్‌ కలుగుతాయి..


అల్లం..
అల్లంల పవర్‌ఫుల్‌ యాంటీ ఇన్ల్ఫమేటరీ, యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అల్లం మన వంటగదిలో ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. దీన్ని టీ రూపంలో కూడా తీసుకుంటాం. అంతేకాదు అల్లం మనం వంటల్లో కూడా ఉపయోగిస్తాం. ఇందులో ఉండే జింజోరెల్‌ ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తాయి. ఇది ప్రాణాంతక వ్యాధుల నుంచి కూడా మనల్ని కాపాడుతుంది.


పాలకూర..
పాలకూరలో మన శరీరానికి కావాల్సిన ఖనిజాలు పుష్కలంగ ఉంటాయి. అంతేకాదు ఇందులో విటమిన్‌ ఏ, సీ, ఇ ఉంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, బీటా కెరోటీన్‌ ఉంటుంది. ఇమ్యూనిటీ పనితీరును మెరుగుచేస్తుంది. పాలకూరలో ఐరన్ ఉంటుంది. పాలకూర జ్యూస్‌ రూపంలో కూడా తీసుకోవచ్చు. ఇది కంటి ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. ఎనిమియా సమస్య రాకుండా కూడా నివారిస్తుంది. 


ఇదీ చదవండి:  ఈ 5 ఆహారాలు మీకు హార్ట్ ఎటాక్ రాకుండా చేస్తాయి.. మీ డైట్ లో తప్పక ఉండాల్సినవి..


యోగర్ట్‌..
యోగర్ట్‌లో ప్రోబయోటిక్‌ ఉంటుంది. ఇది పేగు ఆరోగ్యాన్ని మేలు చేస్తుంది. ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తుంది. యోగర్ట్‌ ఆరోగ్యకరమైన పేగు కదలికలకు తోడ్పడుతుంది. యోగర్ట్‌ ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు) 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి