Hemoglobin Increase : ఉసిరి రసంతో రక్తంలో హిమోగ్లోబిన్ బూస్ట్.. అంతేకాకుండా ఈ సమస్యలకు చెక్..
How To Increase Hemoglobin in 12 Days: ఉసిరి రసంలో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. కాబట్టి దీనిని క్రమం తప్పకుండా తీసుకుంటే.. కేవలం 5 రోజుల్లో హిమోగ్లోబిన్ స్థాయి పెరుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఉసిరి రసం తాగడం వల్ల కంటి చూపు కూడా మెరుగుపడుతుంది.
How To Increase Hemoglobin In 12 Days: జీవన శైలిలో మార్పులు రావడం వల్ల చెడు ఆహారాలు తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి క్రమంగా తగ్గుతూ వస్తుంది. ముఖ్యంగా చలికాలంలో ఇలాంటి సమస్యల బారిన పడడం చాలా సులభమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శీతాకాలంలో శరీరంలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల ప్రమాదకరమైన వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక వాతావరణంలో కాలుష్యం కారణంగా తేమలో మార్పులు సంభవించి.. కంటి చూపుతో పాటు.. రోగ నిరోధక శక్తి సమస్యలు ఉత్పన్నమయ్య అవకాశాలున్నాయి. అయితే ఈ సమస్యల నుంచి చలికాలంలో సులభంగా ఉపశమనం పొందడానికి ఆయుర్వేద నిపుణులు సూచించిన ఈ క్రింద పేర్కొన్న రసాలను తాగాల్సి ఉంటుంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఉసిరి రసం:
ఉసిరి రసం చలికాలంలో క్రమం తప్పకుండా తాగితే శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి కంటి చూపు కూడా మెరుగుపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు అంతేకాకుండా శరీరంలో ఎర్ర రక్త కణాల సంఖ్య.. హిమోగ్లోబిన్ స్థాయి పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇందులో ఉండే విటమిన్ సి చర్మానికి చాలా రకాల ప్రయోజనాలను చేకూర్చుతుంది. అంతేకాకుండా శరీరంపై వచ్చే డార్క్ స్పాట్స్ను సులభంగా నియంత్రిస్తుంది.
ఉసిరి రసం తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే:
>>ఉసిరి రసం కంటి చూపును పెంచడానికి సహాయపడుతుంది.
>>శరీరంలో నీటి కోరతను తగ్గించి బాడీని హైడ్రేట్ గా ఉంచుతుంది.
>>రోగ నిరోధక శక్తిని పెంచేందుకు కీలక పాత్ర పోషిస్తుంది.
>>శరీరాన్ని అంటువ్యాధుల నుంచి సంరక్షిస్తుంది.
>>చర్మ సౌందర్యాన్ని పెంచి చర్మ సమస్యలను తగ్గిస్తుంది.
>>మలబద్ధకాన్ని సులభంగా తగ్గిస్తుంది.
>>కళ్ళు ఎర్రబడకుండా కంటిని సంరక్షిస్తుంది.
Also Read : Samantha Cries: అంతా అయిపోయింది అనిపించింది.. అరుదైన వ్యాధి గురించి చెబుతూ ఏడ్చేసిన సమంత!
Also Read : Bigg Boss Faima : నామినేషన్లో దిగజారుతూనే ఉన్నారు.. ఒళ్లు మరిచిపోతోన్న ఫైమా, శ్రీహాన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook