Anthurium Plants: ఇంట్లో ఎప్పుడు కూడా వాతావరణం ఆహ్లాదంగా ఉండాలి. అప్పుడే మనకు మంచి పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. చాలామంది ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ పెంచడం మనం గమనించవచ్చు. ఇలా చేయడం వల్ల ఇంట్లో గాలి శుభ్రపడడమే కాకుండా స్వచ్ఛంగా ఉంటుంది. పచ్చదనాన్ని చూడడం వల్ల కంటికి కూడా ఎంతో మేలు అని నిపుణులు చెబుతారు. ఇలా పెంచుకునే ఇండోర్ ప్లాంట్స్ లో కాలుష్యాన్ని హరించే మొక్క గురించి మీకు తెలుసా?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అదేనండి ఇప్పుడు ఎక్కువగా ఇండోర్ వెరైటీగా పెంచుకునే ఆంథోరియం ప్లాంట్..ఈ  ఒకటి ఇంట్లో ఉంటే.. ఇక ఇంట్లో ఆక్సిజన్ కి ఎటువంటి కొరత ఉండదు. ఎప్పుడు ఫ్రెష్ గా ఉండడమే కాకుండా గాలి స్వచ్ఛంగా ఉండేలా చూసుకుంటాయి ఈ మొక్కలు. సుమారు 300 రూపాయల ఖరీదు కి ఇవి మార్కెట్లో సులభంగా దొరుకుతున్నాయి. పైగా వీటిని ఇంట్లో పెంచడం కూడా ఎంతో సులభం.


పచ్చటి తమలపాకుల వంటి ఆకులు కలిగిన ఈ మొక్కకు ఎరుపు , గులాబీ రంగులలో పువ్వులు పూస్తాయి. విచిత్రం ఏమిటంటే ఈ పువ్వులు అంత సామాన్యంగా వాడి పోవు.. 6 నెలలు పాటు ఇవి ఫ్రెష్ గా ఉంటాయి. ఈ మొక్క ఇండోనేషియా జాతికి చెందినది. ఇది ఎటువంటి వాతావరణం అయినా తట్టుకొని పెరగగలదు. అందుకే ఈ మొక్కను ఇంటి ఆవరణలో, పెరట్లో, బాల్కనీలో, టెర్రస్ పైన లేక ఇంట్లో ఎక్కడైనా పెంచుకోవచ్చు. ఎండ, వాన ,చలి అన్ని తట్టుకొని దీటుగా పెరుగుతుంది.


ఈ మొక్క మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే ఇది కార్బన్ డైయాక్సడ్ ను పూర్తిగా గ్రహించి  ఆక్సిజన్ ను అందిస్తుంది. పైగా కొందరు ఈ చెట్టు అదృష్టం తేవడంతో పాటు ఇంటిలో ఉన్న నెగెటివిటీని దూరం చేస్తుంది అని నమ్ముతారు. ఇంట్లో ఎప్పుడూ నిరంతరం మనుషులు ఉంటారు. అలాగని ఎల్లవేళలా తలుపులు కిటికీలు తెరిచి పెట్టలేము కదా. పోనీ అలా తీసి పెట్టినా వెంటిలేషన్ ఎంతో కొంత తక్కువగానే ఉంటుంది. మరి అలాంటప్పుడు ఇంట్లో నిరంతరం శ్వాసక్రియ జరుగుతున్నప్పుడు తెలియకుండా ఇంటి లోపల గాలి లో కార్బన్ డయాక్సైడ్ శాతం ఎక్కువ అయిపోతుంది.


అయితే మనం  ఇంట్లో ఆంథోరియం మొక్క పెంచుకున్నట్లయితే అది గాలిలోని కార్బన్ డయాక్సైడ్ ను తీసుకొని ఫ్రెష్ గా ఆక్సిజన్ అందిస్తుంది. ఈ చెట్టుకి పెద్దగా నీళ్లు కూడా పోయాల్సిన పనిలేదు. వారానికి ఒకరోజు కాస్త తడిపితే ఈ మొక్క ఫ్రెష్ గా ఉంటుంది. అంతేకాదు మీ ఇంటి చుట్టుపక్కల ఎక్కువ వాహనాల రాకపోకలు జరుగుతూ.. కాలుష్యం ఏర్పడుతుంటే మీ టెర్రస్ బాల్కనీ లేక ఇంటి ముందర స్థలంలో ఈ మొక్కలను వేస్తే చాలు.. పర్యావరణానికి కూడా మేలు చేసిన వాళ్ళు అవుతారు. అంత ఖరీదు పెట్టి అన్ని మొక్కలు కొనాలా? అనుకోకండి ఒక్క మొక్క కొంటే చాలు అది స్వయంగా వృద్ధి చెంది పెద్ద గుబురు లాగా తయారవుతుంది.


Also Read: Zebronics Juke Bar 9750 Pro: డెడ్‌ చీప్‌ ధరకే JBL సౌండ్‌ బార్‌ను మించిన Zebronics Juke బార్‌..ధర, ఫీచర్స్‌ వివరాలు ఇవే!  


Also Read: Lava Blaze 2 5G Price: Lava నుంచి మార్కెట్‌లో అరుదైన మొబైల్‌..ఫీచర్స్‌ చూస్తే ఆశ్చర్యపోతారు!



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook