iPhone Factory Reset: యాపిల్ ఐఫోన్ స్మార్ట్ ఫోన్ కు ప్రపంచవ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ వేరియంట్స్ మార్కెట్లోకి వచ్చిన ప్రతిసారీ మంచి గిరాకీ ఉంటుంది. అయితే ఈ ఐఫోన్ వాడేవారిలో చాలామందికి రీసెట్ ప్రాసెస్ తెలియదు. కొన్నిసార్లు ఈ ఐఫోన్ ను రీసెట్ చేయాలంటే చాలా కష్టతరంగా భావిస్తారు. అలాంటి వారి కోసం ఐఫోన్ రీసెట్ చేసే విధానాన్ని సులభమైన విధానంతో వివరిస్తున్నాం. అదెలాగో తెలుసుకోండి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మీ iPhoneతో సమస్య ఉందా? లేదా మీరు తాజా iOS 15.4 సాఫ్ట్‌వేర్‌కి అప్‌డేట్ చేయాలనుకుంటున్నారా? ఈ రెండు సమస్యలకు మీ iPhone ను ఫ్యాక్టరీ సెట్టింగ్‌లకు (iPhone దాని ఫ్యాక్టరీ సెట్టింగ్‌లకు) రీసెట్ చేయడం మంచిది. కానీ, ఈ ప్రక్రియను చేసేందుకు ముందు ఐఫోన్ లోని ముఖ్యమైన డేటాను బ్యాకప్ చేయడం ఉత్తమం. లేకపోతే ఫ్యాక్టరీని రీసెంట్ చేసే క్రమంలో మీకు అవసరమైన డేటాను కోల్పోయే అవకాశం ఉంది.  


ఐఫోన్ రీసెట్ ప్రాసెస్..


మీరు మీ iPhoneలో ఫ్యాక్టరీ రీసెట్ చేసే ముందు.. మీ Apple ID నుంచి లాగ్ అవుట్ చేయాలి. ఐఫోన్ సెట్టింగ్స్ ను ఓపెన్ చేసి.. అందులో ఉన్న మీరు పేరు లేదా యాపిల్ ఐఫోన్ ఐడీపై క్లిక్ చేయండి. Apple ID పేజీలో iCloud అనే ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేయండి.


అందులో 'iCloud బ్యాకప్' ఆప్షన్ ను ఎంచుకోవాలి. iCloudలో మీ మొత్తం సమాచారాన్ని బ్యాకప్ చేయడానికి 'బ్యాక్ అప్ నౌ' ఎంపికను క్లిక్ చేయాలి. ఈ ప్రక్రియ పూర్తైన తర్వాత అందులో నుంచి నిష్క్రమించాలి. అయితే ఆ సమయంలో మీ పాస్ వర్డ్ ను నమోదు చేయాల్సిన అవసరం రావొచ్చు. పాస్ వర్డ్ టైప్ చేసి ఆ ప్రక్రియను ఆపేయాలి.  


Also Read: Holi Festival Precautions: ఈ అనారోగ్య సమస్యలతో బాధపడేవారు హోలీ జరుపుకోకపోవడమే మంచిది!


Also Read: Holi 2022 Celebration: హోలీ సెలెబ్రేషన్స్.. ఒక్క నిమిషంలో 100 బెలూన్స్ నీటితో నింపొచ్చు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook