Stress In childrens During Coronavirus Pandemic: పిల్లలతో పాటు పెద్దలు కూడా కరోనావైరస్ ( Coronavirus ) వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొటున్నారు. గతంలో పిల్లలు చదువుతో పాటు ఆట పాటలు, స్నెహితులను కలిసే అవకాశం ఉండేది. కానీ లాక్ డౌన్ ( Lockdown ) వల్ల పిల్లలు ఇంటికే పరిమితం అయ్యారు. స్కూళ్లు, కాలేజీలు మూసి ఉండటంతో ప్రస్తుతం డిజిటల్ ఎడ్యుకేషన్ ( Digital Education ) విధానంలో మాత్రమే విద్యను అభ్యసిస్తున్నారు. అయితే విద్యార్థుల విషయంలో చదువుతో పాటు అనేక అంశాలపై ఫోకస్ పెట్టే అవసరం ఉంది. ఈ సమయంలో పిల్లలకు సరైన మార్గదర్శనం చేసే అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి పరిస్థితిలో కూడా వారిలో ఉత్సాహం, ఆనందం, ఆత్మవిశ్వాసం సడలకుండా పెద్దలు క్రియాశీల పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది. ( Safe From Coronavirus: కరోనా నుంచి కాపాడే 8 అలవాట్లు ) 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


పిల్లలకు అండగా ఉండండి
ఈ రోజుల్లో పిల్లలపై మానసిక ఒత్తిడి ( Mental Pressure) పెరుగుతోంది. ఇలాంటి సమయంలో వారిని అర్థం చేసుకుని వారికి అండగా ఉండటం తల్లిదండ్రుల ప్రధాన బాధ్యత. పిల్లల చదువుతో పాటు వారి జీవితం, మానసిక పరిస్థితి గురించి కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి-


1. టైమ్ టేబుల్ ( Time Table For Kids )
పిల్లల కోసం ప్రత్యేకంగా ఒక టైమ్ టేబుల్ సెట్ చేసి ఉంచండి. ఎప్పుడు లేవాలి.. ఎప్పుడు పడుకోవాలి.. ఎప్పుడు ఆడుకోవాలి అనేది అందులో వివరించాలి. దాంతో కొన్ని నెలల తరువాత వాళ్లు పాఠశాలకు వెళ్లినా వారికి పెద్ద భారంగా అనిపించదు. ( 
Quarentine Tips: హోమ్ క్వారంటైన్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే )



2. సోషల్ డిస్టెన్సింగ్ ( Social Distancing )
పిల్లలు ఇంటికి పరిమితం అవ్వడానికి ప్రధాన కారణం సోషల్ డిస్టెన్సింగ్. అయితే భవిష్యత్తులో స్కూళ్లు తెరుచుకున్నాక పాటించాల్సిన నియమాల గురించి వారికి తెలియజేయండి. దాంతో పాటు తరచూ పిల్లలు వాళ్ల స్నేహితులతో, టీచర్స్ తో మాట్లాడేలా చూడండి. దాంతో వారిలో ఒత్తిడి తగ్గుతుంది.


3. స్వేచ్ఛ ( Freedom )
పిల్లలు ఇంట్లో ఉన్నారు కదా అని మీకు నచ్చిన పనులు చేయమని.. లేదా మీరు చెప్పిన విధంగా ఉండాలి అని కట్టడి చేయకండి. వారికి స్వేచ్ఛ ఇవ్వండి. వారికి నచ్చిన పని ఎలా చేయాలో అందులో మీరు సహాయం అందించండి. వారి ఇమోషనల్ హెల్త్ ( Emotional Health ) విషయంలో జాగ్రత్తగా ఉండండి. ( 
Immunity in Childrens: పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం ఇదే )



4. టీచర్లతో మాట్లాడండి ( Speek To Teachers )
పిల్లల టీచర్లతో రెగ్యులర్ గా మాట్లాడండి. వారిని అడిగి పిల్లల కోసం షెడ్యూల్ సిద్ధం చేయండి.


5. స్నేహితుడిలా ప్రవర్తించండి ( Be Like A Friend )
మీ పిల్లలు కాలేజీకి వెళ్లే వయసులో ఉంటే వారితో స్నేహంగా మెలగండి. అనవసరంగా ఎదిగిన పిల్లలకు క్లాస్ పీకకండి. వారిలా ఆలోచించి వారి మంచి కోసం సహాయం చేయండి. పరిస్థితులు సాధారణ స్థితికి చేరాలి అంటే కాస్త సమయం పడుతుంది. అందుకే మీ పిల్లల మానసిక ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి.


Read This Stoty Also:


Men's Tips For Beard: గడ్డం పెంచడానికి పాటించాల్సిన టిప్స్ ఇవే


Credit Card Benefits: క్రెడిట్ కార్డు వల్ల లాభాలివే..


Mask During Workouts: వర్కవుట్ చేసే సమయంలో మాస్క్ వేసుకోవాలా వద్దా ?