Iron Deficiency Disease: మన శరీర అభివృద్ధికి, ఆరోగ్యానికి ఖనిజాలు చాలా అవసరం. ప్రస్తుతం చాలా మంది అనారోగ్యకరమైన ఆహారాలు అతిగా తీసుకుంటున్నారు. వీటిని తీసుకోవడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలతో పాటు శరీరంలో పోషకాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా చాలా మందిలో ఐరన్‌ లోపం సమస్యలు వస్తున్నాయి. దీని కారణంగా రక్తహీనత, రక్తంలో కాణాలు తగ్గుతాయి. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ లోపం కారణంగా కింది వ్యాధుల బారిన పడుతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also read: BRS MLA Gampa Govardhan: రైస్ మిల్లు సిబ్బంది చెంప ఛెళ్లుమనిపించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే.. వీడియో వైరల్


  1. ఐరన్‌ లోపం వల్ల కలిగే దుష్ప్రభావాలు:

  2. శరీర బలహీనత

  3. జుట్టు రాలడం

  4. అలసిపోవడం

  5. గొంతు నొప్పిలు

  6. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది

  7. నాలుక ఎండిపోవడం

  8. తీవ్ర దాహం


ఏ వయస్సులో ఉన్న వారికి ఎంత ఐరన్‌ అవసరమో తెలుసా?


  • 4 నుంచి 8 సంవత్సరాల చిన్న పిల్లలకు రోజు  10 mg ఐరన్‌ అవసరమవుతుంది.

  • 9 నుండి 13 సంవత్సరాల వారికి ప్రతి రోజు  8 mg ఐరన్‌ కావాల్సి ఉంటుంది.

  • 19 నుంచి 50 సంవత్సరాల వయస్సు గల మహిళలకు రోజు 18 mg ఐరన్‌ అవసరం. 

  • 19 నుంచి 50 సంవత్సరాల వయస్సు గల పురుషులు 8 mg ఐరన్‌ కావాల్సి ఉంటుంది.


ఈ ఆహారాలు తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది:
బాదం, జీడిపప్పు, వాల్‌నట్, తులసి, బెల్లం, వేరుశెనగ, నువ్వులు, బీట్‌రూట్, ఉసిరి, పిస్తా, నిమ్మకాయ, దానిమ్మ, యాపిల్, బచ్చలికూర, ఎండు ఎండుద్రాక్ష, అంజీర్‌, జామ, అరటి, మొలకలు ప్రతి రోజు తీసుకోవాల్సి ఉంటుంది. వీటిని ప్రతి రోజు తినడం వల్ల ఐరన్‌ లోపం తగ్గుతుంది. 


(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


Also read: BRS MLA Gampa Govardhan: రైస్ మిల్లు సిబ్బంది చెంప ఛెళ్లుమనిపించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే.. వీడియో వైరల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook