Jeera Pani Upay For Weight Loss In 7 Days: పేలవమైన జీవనశైలి కారణంగా చాలా మంది బరువు పెరుగుతున్నారు. దీంతో వారు తీవ్ర అనారోగ్య సమస్యల బారినపడుతున్నారు. అయితే బరువు వల్ల చాలా మంది  షుగర్, హై బీపీ, ఉబ్బసం, మధుమేహంతో పాటు గుండెపోటు వ్యాధి సమస్యలకు గురవుతన్నారు. అయితే బరువు పెరిగితే శరీరంపై తప్పకుండా ప్రత్యేకమైన శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అంతేకాకుండా వ్యాయామాల సమయంలో తప్పకుండా పలు ఇంటి చిట్కాలను పాటించాల్సి ఉంటుంది. అయితే బరువు తగ్గడానికి జీలకర్రను కూడా వినియోగించవచ్చు. వీటితో చేసిన టీలను వినియోగించడం వల్ల సులభంగా బరువు తగ్గొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఈ జీలకర్రను బరువు తగ్గడానికి ఎలా వినియోగించాలో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జీలకర్ర నీరు:
ప్రతి ఇంటి వంటగదిలో జీలకర్ర సులభంగా లభిస్తుంది.  ఇందులో శరీరానికి కావాల్సిన కాల్షియం, ఐరన్, జింక్, మాంగనీస్, ఫాస్పరస్ పుష్కలంగా లభిస్తుంది. కాబట్టి  ప్రతి రోజూ జీలకర్రను నీటిలో కలిపి తాగితే.. అది శరీరంలో పేరుకుపోకు పోయిన చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి కీలక పాత్ర పోషిస్తుంది. అయితే దీంతో బరువు కూడా సులభంగా తగ్గుతారు. ఈ నీటిని తయారు చేసుకోవడానికి  2 టీస్పూన్ల జీలకర్రను ఒక గ్లాసు నీటిలో వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయం నిద్రలేచిన తర్వాత పడిగడుపున ఈ నీటిని తీసుకుంటే బరువు సులభంగా తగ్గుతారు.


జీలకర్ర, కరివేపాకు నీరు:
కరివేపాకు, జీలకర్ర నీటి మిశ్రమం కూడా బరువు తగ్గడానికి చాలా ప్రభావవంతంగా కృషి చేస్తుంది. కాబట్టి మీరు దీనిని తయారు చేయడానికి ముందుగా  రాత్రిపూట ఒక గ్లాసు నీరు తీసుకొని అందులో 1 టీస్పూన్ జీలకర్ర,  7 కడిగిన కరివేపాకు వేయండి. ఇలా రాత్రంత నానబెట్టిన తర్వాత ఖాళీ కడుపుతో తీసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా తీసుకుంటే శరీరానికి ప్రయోజనాలు లభించడమేకాకుండా.. సులభంగా బరువు తగ్గుతారు.


జీలకర్ర, కొత్తిమీర నీరు:
జీలకర్ర, కొత్తిమీర నీరు కూడా శరీర బరువును సులభంగా నియంత్రించడానికి కృషి చేస్తుంది. ఇది శరీర బరువును అదుపులో ఉంచడానికి ప్రభావవంతంగా కృషి చేస్తుంది. దీనిని తయారు చేసుకోవడానికి ముందుగా ఒక గ్లాసు నీటిలో కొన్ని కొత్తిమీర ఆకులు, జీలకర్ర తీసుకుని అందులో నానబెట్టాలి. ఇలా చేస్తే క్రమం తీసుకుంటే సులభంగా బరువు తగ్గుతారు.


జీలకర్ర పొడి నీరు:
పెరుగుతున్న ఊబకాయాన్ని వదిలించుకోవడానికి జీలకర్ర నీటిని కూడా తీసుకోవచ్చు. ఇలా ఇలా జీలకర్ర పొడితో తయారు చేసిన నీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే బరువు సులభంగా తగ్గుతారని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. దీని వల్ల పొట్టలో జీర్ణ క్రియ సమస్యలు కూడా తగ్గుతాయి.


(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


Also Read : RC 15 : దిల్ రాజు టీం అశ్రద్ద.. రామ్ చరణ్ అంజలి పిక్స్ లీక్


Also Read : Bollywood Affairs: ఎంగేజ్‌మెంట్ తర్వాత పెళ్లి కాకముందే బ్రేకప్ చెప్పుకున్న జంటలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook