Kalonji Seeds Benefits: కలోంజి గింజల వల్ల శరీరానికి కలిగే లాభాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..
Kalonji Seeds Benefits In Telugu: కలోంజి గింజలను ప్రతిరోజు తీసుకోవడం వల్ల అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. వీటిలో ఉండే ఆయుర్వేద గుణాలు శరీరాన్ని ఫిట్‌గా తయారు చేసేందుకు కూడా సహాయపడతాయి. అంతే కాకుండా ప్రాణాంతక వ్యాధులు కూడా దూరమవుతాయి.
Kalonji Seeds Benefits In Telugu: కలోంజీ సీడ్స్ ప్రతి ఒక్కరూ చూసి ఉంటారు. ఇందులో ఎన్నో రకాల ఆయుర్వేద గుణాలు నిండి ఉంటాయి. ఇవి చూడడానికి నల్లగా చిన్నగా కనిపించినప్పటికీ వీటిలో శరీరానికి అవసరమైన పోషకాలు లభిస్తాయి. అంతేకాకుండా ఇందులో ఉండే ఆయుర్వేద గుణాలు అన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగించి శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను అందిస్తాయి. ఈ కలోంజి గింజలల్లో విటిమిన్ ఎ, బి, బి12, సి వంటి పోషకాలు అధిక మోతాదులో లభిస్తాయి. కాబట్టి ప్రతిరోజు తీసుకోవడం వల్ల ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా ఉంటారని నిపుణులు చెబుతున్నారు.
జుట్టు చర్మ సమస్యలకు చెక్:
చిన్న వయసులోనే జుట్టు చర్మ సమస్యలతో బాధపడుతున్న వారు ప్రతిరోజు కలోంజీ సీడ్స్‌ని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ముఖ్యంగా ఇందులో ఉండే గుణాలు చర్మ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగించేందుకు ప్రభావవంతంగా సహాయపడతాయి. అంతేకాకుండా జుట్టు రాలడాన్ని సులభంగా తగ్గిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
కలోంజి గింజలను ప్రతిరోజు తినడం వల్ల ఒత్తిడి ఆందోళన వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా ప్రతిరోజు వీటిని నీటిలో కలుపుకొని తాగడం వల్ల బరువు కూడా తగ్గొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ సీడ్స్‌లో ఉండే గుణాలు జీర్ణక్రియ సమస్యల నుంచి ఉపశమనం కలిగించి ఆకలిని కూడా తగ్గిస్తాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు వీటిని తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తరచుగా అలెర్జీ, చికాకు సమస్యలతో బాధపడే వారు కూడా ఈ గింజలను తీసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
మధుమేహం ఉన్నవారు ఈ కలోంజి గింజలను ప్రతిరోజు తీసుకోవడం వల్ల రక్తంలోని చక్కెర పరిమాణాలు కూడా నియంత్రణలో ఉంటాయి. దీనికి కారణంగా షుగర్ అదుపులో ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే కరోంజీ గింజలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు కూడా ఎంతగానో సహాయపడతాయి. ప్రతిరోజు వీటిని తీసుకోవడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. దీని కారణంగా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా ఉంటారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter