Karonda Fruit Benefits: వాక్కాయలతో మధుమేహంతో పాటు ఈ దీర్ఘకాలిక వ్యాధులకు చెక్..
Karonda Fruit Benefits: వాక్కాయలతో తయారు చేసిన జ్యూస్‌ను ప్రతి రోజు తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు చాలా రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ముఖ్యంగా మధుమేహాన్ని సులభంగా నియంత్రిస్తుంది.
Karonda Fruit Benefits: వర్షాకాలంలో ఎక్కవగా లభించే పండ్లతో వాక్కాయ ఒకటి. ఇందులో అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగించే చాలా రకాల ఔషధ గుణాలు లభిస్తాయి. వీటిని చాలా మంది చట్నీలు కూడా పెట్టుకుంటారు. ఇందులో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. కాబట్టి వీటిని ఆహారాల్లో వినియోగించడం వల్ల సులభంగా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. అందుకే వీటి గురించి ఆయుర్వేద శాస్త్రంలో క్లుప్తంగా పేర్కొన్నారు. క్రమం తప్పకుండా వాక్కాయలను తీసుకోవడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
వాక్కాయలతో శరీరానికి చాలా ప్రయోజనాలు:
మధుమేహం:
మధుమేహంతో బాధపడుతున్నవారు ప్రతి రోజు ఈ వాక్కాయల నుంచి తీసిన రసాన్ని తాగడం వల్ల రక్తంలోని చక్కెర పరిమాణాలు నియంత్రణలో ఉంటాయి. అంతేకాకుండా తీవ్ర అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. తరచుగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు తప్పకుండా వీటితో తయారు చేసిన చట్నీని ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది.
పోషకాహారం సమృద్ధిగా లభిస్తాయి:
ఆధునిక జీవనశైలి కారణంగా చాలా మంది పోషకాహార లోపం సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా వాక్కాయలను తీసుకోవాల్సి ఉంటుంది. వీటిల్లో విటమిన్ సితో పాటు బి, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా యాంటీఆక్సిడెంట్లు కూడా అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుతుంది. దీంతో తీవ్ర దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది.
Also Read: Yamuna danger mark: ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తోన్న యమునా నది.. ఆందోళనలో రాజధాని వాసులు..
ఆకలిని పెంచడానికి సహాయపడుతుంది:
అనారోగ్యకరమైన ఆహారాలు అతిగా తినడం వల్ల ఆకలి తగిపోయి, జీర్ణక్రియ సమస్యలు వస్తాయి. అయితే దీని కారణంగా తీవ్ర పొట్ట సమస్యలు రావచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి ప్రతి రోజు పచ్చి వాక్కాయలను తినాల్సి ఉంటుంది. వీటిని ప్రతి రోజు తినడం వల్ల ఆకలి పెరుగుతుంది. జీర్ణక్రియ సమస్యలు కూడా తగ్గుతాయి.
కాలేయానికి మేలు చేస్తుంది:
వాక్కాయల జ్యూస్ తాగడం వల్ల కాలేయం సమస్యలు కూడా తగ్గుతాయి. ఇందులో ఉండే ఔషధ గుణాలు లివర్ పనితనాన్ని పెంచుతాయి. అంతేకాకుండా శరీరంలో పేరుకుపోయిన యూరిక్ యాసిడ్‌ను తగ్గించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఈ రసాన్ని తాగడం వల్ల కీళ్ల నొప్పుల సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
Also Read: Yamuna danger mark: ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తోన్న యమునా నది.. ఆందోళనలో రాజధాని వాసులు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook