Kidney Stone Treatment: కిడ్నీస్టోన్ సమస్య రావడానికి ప్రధాన కారణాలు ఇవేనా.. ఈ లక్షణాలు ఉంటే కిడ్నీల్లో రాళ్లు ఉన్నట్లేనా..?
Kidney Stone Treatment: కిడ్నీస్టోన్ సమస్యల రావడం వల్ల శరీరంలో చాలా రకాల లక్షణాలు ఏర్పడుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీని కారణంగా చాలా మందిలో మూత్రంలో వాసన, మూత్రంలో రక్తం వంటి సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి ఇలాంటి సమస్యలున్నవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
Kidney Stone Treatment: చలి కాలంలో కిడ్నీ స్టోన్ సమస్యలు రావడం సర్వసాధరణం. అయితే శరీరంలో పెరిగే ఆ రాళ్లు నేరుగా కిడ్నీలపై ప్రభావం చూపుతాయి. ఇవీ కిడ్నీల్లో ఉన్నప్పుడు పరిమాణాలు పెరిగితే కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే ప్రమాదం కూడా ఉందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా వీటి పరిమాణాలు పెరిగితే తీవ్ర నొప్పి సమస్యలు కూడా వచ్చే అవకాశాలున్నాయి. ఇలాంటి తీవ్ర నొప్పుల సమస్యలు ఉంటే తప్పకుండా వైద్యులను సంప్రదించడం చాలా మంచిది. లేకపోతే ప్రాణాంతకంగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే కిడ్నీల్లో రాళ్ల సమస్యలతో బాధపడుతున్నవారు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
మూత్రపిండంలో రాళ్ల సమస్యలు:
కిడ్నీస్టోన్ లేదా కాలిక్యులస్ అనేది కిడ్నీలో పేరుకుపోయే ఒక రకమైన రసాయనాలతో కూడిన రాళ్లు. ఈ సమస్యలు రావడానికి ప్రధాన కారణాలు కిడ్నీలో అదనపు పోషకాలు చేరడం వల్లే ఇలాంటి సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా టాక్సిన్స్ పేరుకుపోవడం వల్ల కూడా రాళ్లు ఏర్పడవచ్చని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. లేకపోతే కిడ్నీలు చెడిపోయే అవకాశాలున్నాయి.
వెన్ను, కడుపు నొప్పి:
కిడ్నీ స్టోన్ కారణంగా తీవ్రమైన నొప్పులు ఇతర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రాళ్ల వల్ల కడుపు, వెన్నునొప్పి ఇతర సమస్యలు ఉత్పన్నవయ్యే ఛాన్స్ కూడా ఉంది. అయితే శరీరంలో రాళ్ల పరిమాణాలు చిన్నగా ఉంటేనే ఎలాంటి నొప్పులు రావు.. ఒక వేళా రాళ్లు పెద్దగా పెరిగితే తీవ్ర నొప్పులు వచ్చే ఛాన్స్ ఉంది.
మూత్రంలో వాసన:
కిడ్నీలో రాళ్లు అధిక పరిమాణాలు పెరిగితే మూత్రం వాసన కూడా రావొచ్చని ఆరోగ్య నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కొందరిలో తీవ్ర మూత వాసన సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
మూత్రంలో రక్తం:
చాలా మందిలో కిడ్నీల్లో స్టోన్స్ పెరిగితే మూత్రంలో రక్తం వచ్చే సమస్య కూడా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇలాంటి సమస్యలు ఉత్పన్నమైతే తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. లేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Buttabomma poster copy: పోస్టర్ ను కూడా కాపీ కొట్టాలా..పాపం నాగవంశీని ఆడేసుకుంటున్నారుగా
Also Read: Ashu Reddy Hot Photos: బ్లాక్ డ్రెస్సులో అషు రెడ్డి అందాల విందు.. ఎద అందాలన్నీ కనిపించేలా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.