Lavender Oil For Hair Loss Baldness: లావెండర్ మొక్కలను మనం తరచుగా ఇళ్లలో చూస్తూ ఉంటాం. ఈ పూలు అద్భుతమైన సువాసను కలిగి ఉంటాయి. ఇందులో ఉండే గుణాలు మైడ్‌ను రిఫ్రెష్‌గా చేయడానికి కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం చాలా మంది జుట్టు సమస్యలతో బాధపడుతున్నవారికి ఈ పూలతో తయారు చేసిన నూనె కూడా చాలా ప్రభావవంతంగా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ నూనులో ఉండే గుణాలు మనస్సును రిలాక్స్ చేయడమేకాకుండా..శరీర అలసటను తొలగించడానికి కూడా కీలక పాత్ర పోషిస్తాయి. అయితే జుట్టు సమస్యలను తగ్గించుకోవడానికి ఈ నూనెను ఎలా వినియోగించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

లావెండర్ ఆయిల్ ప్రయోజనాలు:
ప్రస్తుతం చాలా మంది లావెండర్‌ను ఫ్రెషనర్‌గా ఉపయోగిస్తున్నప్పటికీ.. ఇది ఆరోగ్యానికి, అనారోగ్య సమస్యలను తగ్గించడానికి కీలక పాత్ర పోషిస్తుందని చాలా మందికి తెలియదు. అయితే ఈ పూలతో తయారు చేసిన నూనెను ఎలా వినియోగించుకోవాలో తెలుసుకుందాం.


1. ఒత్తిడిని దూరం చేస్తుంది:
లావెండర్ ఆయిల్‌లో యాంటి యాంగ్జయిటీ, యాంటీ డిప్రెసెంట్ గుణాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. ఇవి మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి సహాయపడుతుంది. అయితే ఈ నూనెలో టీ ట్రీ ఆయిల్‌ని కలిపి దూపంలా వినియోగిస్తే మనస్సు ప్రశాంతంగా, ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. కాబట్టి అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పకుండా దీనిని వాడాల్సి ఉంటుంది.


2. నిద్రలేమి సమస్యలు:
ఈ నూనె ఒత్తిడిని తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు రిలాక్స్ జోన్‌కి తీసుకువెల్లి నిద్రలేమి సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా దీనిని తైలమర్ధనం కోసం వినియోగిస్తే చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు అనారోగ్య సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తుంది.


3. తలనొప్పి చిటికలో ఉపశమనం:
ప్రస్తుతం చాలా మంది వివిధ కారణాల వల్ల తల నొప్పి సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ నొప్పి నుంచి సులభంగా లావెండర్ ఆయిల్‌ వినియోగించి ఉపశమనం పొందవచ్చని నిపుణులు అంటున్నారు. ఇందులో ఉండే గుణాలు ఒత్తిడిని తగ్గించి..  మైగ్రేన్ నొప్పుల నుంచి ఉపశమనం కలిగించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది.
 
4. చర్మానికి మేలు చేస్తుంది:

లావెండర్ ఆయిల్ చర్మానికి అప్లై చేస్తే చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని సౌందర్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే దీనిని నేరుగా అప్లై చేస్తే హానికరం.. కాబట్టి తప్పకుండా ఆయిల్ లేదా మాయిశ్చరైజర్‌తో కలిపి అప్లై చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. దీనిని క్రమం తప్పకుండా ముఖానికి అప్లై చేస్తే మొటిమల సమస్యలు కూడా దూరమవుతాయి.


5. జుట్టు సమస్యలకు చెక్‌:
 లావెండర్ ఆయిల్‌లో ఉండే గుణాలు జుట్టు సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తుంది. అయితే జుట్టు సమస్యలున్నవారు ప్రతి రోజూ ఈ నూనె వెంట్రుకలను అప్లై చేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా యాంటీ-డాండ్రఫ్ షాంపూలో ఈ నూనె మిక్స్‌ చేసి జుట్టును శుభ్రం చేసుకుంటే చాలా రకాల జుట్టు సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చని సౌదర్య నిపుణులు తెలుపుతున్నారు.


(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


Also Read: Tax Saving Schemes 2023: ఈ పథకంలో పెట్టుబడి పెట్టండి.. ఆదాయంతోపాటు సూపర్ బెనిఫిట్స్  


Also Read: Shubman Gill: ఉప్పల్‌లో పరుగుల ఉప్పెన.. చరిత్ర సృష్టించిన శుభ్‌మన్ గిల్ 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి