Homemade Scrub For Glowing Skin:  ప్రస్తుతకాలంలో చాలా మంది మొటిమలు, అలర్జీ, జిడ్డు, నిర్జీవంగా ఉండే చర్మ సమస్యలతో బాధపడుతున్నారు. దీని కోసం మార్కెట్‌లో లభించే ఫేస్‌ క్రీములు, ప్రొడెక్ట్స్‌లు, ఫేస్‌ మాస్క్‌లు, సబ్బులు అంటూ అతిగా ఖర్చు చేస్తుంటారు. ముఖ్యంగా వేసవి సమయంలో ఈ సమస్యలు మరింత ఎక్కువగా కలుగుతాయి. అయితే ఎలాంటి ఖర్చు లేకుండా ఇంట్లో కొన్ని సహజమైన స్ర్కబ్‌లను తయారు చేసుకొని ఉపయోగించడం వల్ల చర్మ సమస్యలు తగ్గు ముఖం పడుతాయి.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

స్క్రబింగ్‌ అనేది ఒక సహజమైన స్కిన్ టిప్‌ అని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల చర్మంలో ఉండే మురికి, డెడ్ సెల్స్‌ను సులభంగా తొలగించుకోవచ్చు. అయితే దీని కోసం మీర ఖరీదైన ప్రొడెక్ట్స్‌ను ఉపయోగిల్సాని అవసరం లేదు. మీరు కేవలం వంటింల్లో ఉపయోగించే పదార్థాలను వాడుతే సరిపోతుంది. స్క్రబ్ చేయడం వల్ల  చర్మానికి తేమను, మెరుపును పొందవచ్చు. అయితే కొన్ని అద్భుతమైన స్క్రబ్స్ గురించి తెలుసుకుందాం.


 నిమ్మరసం, తేనె స్క్రబ్‌: 


ఇంట్లోనే ఎంతో సులభంగా నిమ్మకాయ, తేనెను ఉపయోగించి మీరు స్క్రబ్‌ను తయారు చేసుకోవచ్చ. దీని కోసం మీరు ముందుగా ఒక గిన్నెలో నిమ్మరసం, తేనెను తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో కొంచెం పంచదారను కలుపుకోవాలి. దీనిని ముఖం, మెడపైన అప్లై చేసుకోవాలి. దీని వల్ల చర్మం కాంతివంతంగా కనిపిస్తుంది. 


గ్రీన్‌టీ , ఆలివ్‌ ఆయిల్ స్క్రబ్‌: 


అందంగా, ఆరోగ్యకరమైన చర్మం కోసం గ్రీన్‌ టీ, షుగర్‌, ఆలివ్‌ ఆయిల్‌ ఎంతో మేలు చేస్తాయి. వీటిని ఉపయోగించి సహజసిద్ధమైన మాయిశ్చరైజర్‌ను తయారు చేసుకోవచ్చు. దీని వల్ల ముఖంపై కలిగే మొటిమలు, మచ్చలు దూరం అవుతాయి. 


ఓట్స్‌ పొడి, షుగర్‌ స్క్రబ్‌: 


జిడ్డు చర్మం వల్ల ఎన్నో ఇబ్బందులు కలుగుతాయి. అయితే ఓట్స్‌ పౌడర్, షుగర్‌, ఆలివ్ నూన్‌ వీటి కాంబినేషన్‌ తో స్క్రబ్‌ను తయారు చేసుకోవాలి. దీని వల్ల చర్మంపై అప్లై చేసకొని గోరువెచ్చని నీరుతో శుభ్రం చేసుకోవాలి. దీని వల్ల  జిడ్డు, అలర్జీలు సమస్యలకు చెక్‌ పెట్టవచ్చు. 


కాఫీ, షుగర్‌ స్క్రబ్‌: 


కాఫీ, షుగర్‌తో తయారు చేసే స్క్రబ్‌ ఎంతో ఉపయోగపడుతుంది. ఇందులో ఎక్స్ ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్, మూడు విటమిన్ ఇ కాప్సూల్స్ కలిపి అప్లై చేసుకోవడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి. దీని వల్ల చర్మం సున్నితంగా మారుతుంది. 


పెరుగు, ఆలివ్ ఆయిల్ స్క్రబ్‌: 


చర్మం మాయిశ్చరైజ్‌గా ఉండటం చాలా అవసరం. దీని కోసం మీరు ఒక టేబుల్ స్పూన్ పెరుగు, పావు కప్పు ఆలివ్ ఆయిల్,  తేనె,  గర గరగా ఉండే షుగర్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. దీని వల్ల చర్మం పై ఉండే డెడ్‌ సెల్స్, మురికి  తొలుగుతుంది. అలాగే మాయిశ్చరైజ్‌ అవుతుంది.  


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి