Benefits of Ginger Water:  అల్లం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మనం ఎక్కువగా దీనిని కూరల్లో ఉపయోగిస్తాం. అంతేకాకుండా అల్లంను టీలో కూడా వేసుకుంటాం. అల్లంలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది ఎన్నో వ్యాధులను దూరం చేస్తుంది. అల్లం టీ లాగే అల్లం నీరు తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇది ఎన్నో  రకాల ఆరోగ్య సమస్యలకు చెక్ పెడుతుంది. అల్లం నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అల్లం నీరు తాగడం వల్ల లాభాలు
.** జింజర్ వాటర్ లో విట‌మిన్ సి, మెగ్నిష‌యం పోషకాలు ఉంటాయి. దీనిని తీసుకోవడం వల్ల మీ రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా ఇది జబులు, దగ్గు వంటి వాటిని దరిచేరనీయదు. 
.** అల్లం నీరు తాగడం వల్ల చర్మానికి నిగారింపు వస్తుంది. అంతేకాకుండా ఇది మెుటిమలు, చర్మ వ్యాధులను దూరం చేస్తుంది. 
.** అల్లం నీరు తాగడం వల్ల మీ జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. ఆహారం అరుగుదలకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా అజీర్తి, మలబద్దకం వంటి సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది.
.** బరువు తగ్గాలనుకునేవారు రోజూ అల్లం నీరు తాగడం మంచిది. ఎందుకంటే ఇది శరీరంలోని కొవ్వును తగ్గించడంలో చాలా బాగా పనిచేస్తుంది. ఇది విరేచనాలను కూడా అరికడుతుంది.
.** జింజర్ వాటర్ తీసుకోవడం వల్ల గుండె జబ్బులు రావు. అంతేకాకుండా ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. 
 .** అల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇది క్యాన్సర్ రాకుండా నిరోధించడంలో సహాయపడుతుంది. 
 .** అల్లంలో ఫోలేట్, పోటాషియం అధికంగా ఉంటాయి. జింజర్ వాటర్ తాగడం వల్ల ఎముకలు గట్టిపడతాయి. 


Also Read: Side Effects of Turmeric: ఈ సమస్యలు ఉన్నవారు పసుపు అస్సలు తినకూడదు..! 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu      


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook