Love And Brain: ప్రేమ, మెదడుకు సంబంధం ఉందా? fMRI నివేదిక ఏం చెప్తుందంటే..
fMRI Facts About Love And The Brain: ప్రేమ అనేది మన గుండెకు మాత్రమే కాదు మెదడుకు సంబంధం ఉందని fMRI అధ్యాయంలో తేలింది. అసలు మన మెదడుకు ప్రేమకు సంబంధం ఏంటి? ఇంతకీ fMRI నివేదిక ఏంటో తెలుసుకుందాం.
fMRI Facts About Love And The Brain: ప్రేమ అనేది మన హృదయానికి సంబంధించిన అనుభూతి అని మనం ఎప్పుడూ అనుకుంటూ ఉంటాం. కానీ, ఇది కేవలం హృదయానికి మాత్రమే పరిమితం కాదు. ఇది మన మెదడులో కూడా అనేక రకాల ప్రభావితం చేస్తుందని ఒక అధ్యాయంలో తేలింది. ఫిన్లాండ్‌లోని ఆల్టో యూనివర్సిటీ పరిశోధకులు ప్రేమ గురించి ఒక ఆసక్తికరమైన అధ్యయనం చేశారు. ఈ అధ్యయనంలో వారు మన మెదడు ప్రేమను ఎలా అనుభవిస్తుందో తెలుసుకోవడానికి ప్రయత్నించారు.
ఎఫ్‌ఎమ్‌ఆర్‌ఐ ( fMRI) అంటే ఏమిటి?
మనం ఏదైనా ఆలోచించినప్పుడు లేదా ఏదైనా చేసినప్పుడు మన మెదడులో రక్త ప్రవాహం మారుతుంది. ఈ మార్పులను ఖచ్చితంగా గమనించడానికి వాడే ఒక ప్రత్యేకమైన సాంకేతికతే ఎఫ్‌ఎమ్‌ఆర్‌ఐ. ఇది మన మెదడు ఎలా పని చేస్తుందో చూపించే ఒక రకమైన 'కెమెరా' లాంటిది. దీని ఉపయోగించి మన మెదడు ఎలా స్పందిస్తుంది అనేది తెలుసుకుంటారు. అయితే దీని ఉపయోగించి ప్రేమ గుండెకు మాత్రమే కాదు మెదడుకు కూడా అనేది ఎలా తెలుసుకున్నారో మనం తెలుసుకుందాం.
అధ్యయనం ఏమి కనుగొంది?
పరిశోధకులు అధ్యయనంలో పాల్గొన్నవారికి ప్రేమ గురించి వివిధ రకాల కథలు చెప్పారు. ఈ కథలను వినే సమయంలో వారి మెదడులో ఏం జరుగుతుందో ఎఫ్‌ఎమ్‌ఆర్‌ఐ ద్వారా గమనించారు. ఈ విధంగా ప్రేమ అనే భావన మన మెదడులోని ఏ భాగాలను ప్రభావితం చేస్తుందో తెలుసుకోవడానికి ప్రయత్నించారు. అయితే ఈ పరీక్ష తరువాత వారు గమనించిన విషయం ఏంటి అంటే.. పిల్లల పట్ల మనకున్న ప్రేమ అంతా మన మెదడులోని ఒక చిన్న భాగం వల్లనే కాకుండా, అది మన మెదడులోని అనేక భాగాలను, కార్యకలాపాలను కలిగి ఉన్న ఒక సంక్లిష్టమైన ప్రక్రియ అని తెలుసుకోవడం ఆశ్చర్యంగా ఉందని నిపుణులు చెబుతున్నారు. "బేసల్ గాంగ్లియా'' ఈ భాగం మోటార్ నియంత్రణ, భావోద్వేగంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అంటే, పిల్లల పట్ల మనం చూపించే శ్రద్ధ, ప్రేమకు ఇది మూలం. '' శృంగార ప్రేమ vs. స్నేహం'' రెండింటికీ మెదడులోని వేర్వేరు భాగాలు ప్రతిస్పందిస్తాయి. శృంగార ప్రేమ రివార్డ్‌లకు సంబంధించిన భాగాలను ఉత్తేజితం చేస్తే, స్నేహం సామాజిక సంబంధాలకు సంబంధించిన భాగాలను ఉత్తేజితం చేస్తుంది. ప్రేమ అనేది ఒక సంక్లిష్టమైన భావన ఇది జన్యుశాస్త్రం, వాతావరణం మరియు వ్యక్తిగత అనుభవాల కలయిక వల్ల ఏర్పడుతుంది.
అధ్యయనం ముగింపు: చివరిగా అధ్యయం ఏం చెబుతుందంటే ప్రేమ కేవలం ఒక భావోద్వేగం మాత్రమే కాదు ఇది మన మోదడులో జరిగే ఒక ప్రక్రియని తేల్చింది.
గమనిక:
ఈ సమాచారం సాధారణ సమాచారం మాత్రమే. మీరు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు, ఒక నిపుణుడిని సంప్రదించడం మంచిది.
Also read: Black Salt: వేడి నీళ్లలో దీన్ని కలుపుకుని తాగితే నిమిషాల్లో బ్లడ్ షుగర్ నార్మల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter