Mango Peel for Wrinkles: మామిడి పండు తొక్కలను ఇలా వాడితే.. చర్మంపై ముఖంపై ముడతలన్నీ మాయం!
Mango Peel Benefits to Skin: మామిడికాయ తొక్కులను తినడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే కులాలు క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులను కూడా నియంత్రిస్తుంది. కాబట్టి మామిడిని తొక్కలతో పాటు తీసుకోవాల్సి ఉంటుంది.
Mango Peel Removes Wrinkles on Wrinkles: వేసవి రాగానే మామిడి పండ్ల సీజన్ మొదలవుతుంది. ఈ క్రమంలో మార్కెట్లో ఎక్కడపడితే అక్కడ విచ్చలవిడిగా మామిడి పండ్లు లభిస్తాయి. వీటిని తినడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అందుకే చాలామంది వీటిని ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. వీటిని తినే క్రమంలో మామిడి పండ్ల పై భాగం అనగా తొక్కలను, గింజలను తీసి పడేస్తూ ఉంటారు. అయితే పండ్లు తినడం వల్ల కలిగే ప్రయోజనాలే కాకుండా వీటి తొక్కలను వినియోగించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మామిడిపండు తొక్కల వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
మామిడిపండు తొక్కలను ఎండలో పెట్టి గ్రైండ్ చేసి పొడిని తీసి చర్మానికి వినియోగించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇందులో చాలా రకాల ఔషధ గుణాలు లభిస్తాయని.. దీనిని వినియోగించడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు అని వారు పేర్కొన్నారు. అయితే ఈ పొడిని ఎలా వినియోగించాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మామిడి తొక్కల పొడిని తీసుకొని అందులో రోజ్ వాటర్ వేసి ముఖానికి బాగా పట్టించాల్సి ఉంటుంది. ఇలా క్రమం తప్పకుండా పట్టించడం వల్ల మీరు త్వరలోనే ముడతలు లేని చర్మాన్ని పొందవచ్చు. ఇందులో ఔషధ గుణాలు కూడా లభిస్తాయి కాబట్టి సులభంగా మొటిమల సమస్యల నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది.
Also Read: White Hair Solution: తెల్ల జుట్టు సమస్యలతో బాధపడుతన్నారా? ఈ మాస్క్‌తో మెరిసేలా, మృదువుగా మారుతుంది!
మామిడి తొక్కలను తినడం వల్ల శరీరంలో చనిపోయిన కణాలన్నీ తొలగించేందుకు సహాయపడుతుంది. అంతేకాకుండా క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ తొక్కలోఫోలేట్, విటమిన్ B6, A, C లభిస్తాయి.. కాబట్టి దీర్ఘకాలిక వ్యాధులనుంచి కూడా ఉపశమనం కలుగుతుంది. కాబట్టి తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు మామిడికాయ తొక్కలను తప్పకుండా తినాల్సి ఉంటుంది.
Grahana Dosham: 18 ఏళ్ల తర్వాత రాహువు యెుక్క వలలో సూర్యుడు... ఈ 3 రాశులవారి జీవితం నాశనం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook