Monsoon Skin Care: ప్రస్తుతం పలు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు ప్రవేశించడంతో కొన్ని ప్రాంతాల్లో వానా కాలం మొదలైంది. ఈ వర్షకాలం అందరికీ మంచి  హాయిని ఇచ్చిన్నప్పడికీ పలు రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలున్నాయి. ముఖ్యంగా చర్మ సంబంధిత వ్యాధులు రావడం.. శరీరంలో రక్త ప్రనరన స్తంభించడం వంటి సమస్యలు రావడం సహజం. అయితే ఈ సమస్యల నుంచి విముక్తి పొందడానికి చాలా మార్గాలున్నాయి. వర్షాల కారణంగా చర్మంపై సెబమ్ గ్రంథులలో సమస్యలు వచ్చి చర్మ సమస్య పెరిగే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఆయిల్ స్కిన్ ఉన్న వారు తీవ్ర చర్మ సమస్యలు ఎదుర్కొనే అవకాశాలున్నారు. అయితే ఈ సమస్యల నుంచి విముక్తి పొందడానికి ముల్తానీ మిట్టితో చేసిన ఫేస్ ప్యాక్‌ని వినియోగించవచ్చని నిపుణులు తెలుపుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. పొడి చర్మం కోసం వారు ఇలా చేయండి:


డ్రై స్కిన్‌కి తేమను తెచ్చి.. మెరిసేలా చేయడానికి.. ముల్తానీ మిట్టితో ఇలా ఫేస్ ప్యాక్‌ను తయారు చేయండి.


# 1 స్పూన్ ముల్తానీ మిట్టి
# 3 టేబుల్ స్పూన్ల పాలు
# పావు టీస్పూన్ తేనె
# ఒక టీస్పూన్ కలబంద జెల్


వీటన్నింటిని మిక్స్ చేసి పేస్ట్ లా తయారు చేసి.. ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల పాటు ముఖం మీద ఉంచండి. ఇది పూర్తిగా ఆరిపోయిన వెంటనే మంచినీటితో శుభ్రం చేయండి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే.. వర్షకాలంలో చర్మం నిగనిగలాడుతుంది.


2. ఆయిల్ స్కిన్ కోసం:


చర్మం జిడ్డుగా ఉన్నవారు.. వేసవి, వర్షాకాలంలో మరింత సమస్యను ఎదుర్కోవలసి ఉంటుంది. ఎందుకంటే వర్షకాలంలో నూనె గ్రంథులు మరింత చురుకుగా మారి ముఖం జిగటగా తయారవుతుంది. అయితే ఈ సమస్య నుంచి విముక్తి పొందడానికి పలు ముల్తానీ మిట్టితో తయారు చేసిన మిశ్రమాన్ని అప్లై చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయని నిపుణులు తెలుపుతున్నారు.


ఈ  మిశ్రమాన్ని తయారు చేసుకోవడానికి కావాల్సి పదార్థాలు:


#1 స్పూన్ ముల్తానీ మిట్టి
#1 స్పూన్ కలబంద జెల్
#1 స్పూన్ గంధపు చెక్క పొడి
#2 నుంచి 3 టీస్పూన్లు రోజ్ వాటర్


వీటన్నింటిని మిక్స్ చేసి ఫేస్ ప్యాక్‌ను సిద్ధం చేసుకోవాలి..చర్మంపై దీనిని అప్లై చేసి 25 నిమిషాల పాటు ఉంచి.. మంచి నీటితో శుభ్రం చేయాలి.


3. కాంబినేషన్ స్కిన్ కోసం:


చర్మంపై కొన్ని చోట్ల జిడ్డుగా, మరి కొన్ని చోట్ల పొడిగా మారుతూ ఉంటుంది. ఇలా మిక్స్డ్ స్కిన్ టైప్ చర్మాన్ని కాంబినేషన్ స్కిన్ అంటారు. ఈ సమస్య నుంచి విముక్తి పొందడానికి ఈ మిశ్రమాన్ని అప్లై చేయండి.


#1 స్పూన్ ముల్తానీ మిట్టి
#1 స్పూన్ రోజ్ వాటర్
#1 టీస్పూన్ అలోవెరా జెల్
#అర టీస్పూన్ తేనె


వీటన్నింటిని కలిపి తయారు చేసిన ఫేస్ ప్యాక్‌ని ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల పాటు ఉంచండి. చర్మం జిడ్డుగా ఉన్న చోట, ఆయిల్ బ్యాలెన్స్ ఉండి, చర్మం తేమగా మారుతుంది.


(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


 


 



 


Also Read: Body Detox Drink: ఉదయాన్నే ఈ డ్రింక్స్‌ తాగితే శరీరంలోని వ్యర్థాలు తొలగిపోతాయి..!


Also Read: TS TET 2022: ఇంకా విడుదల కానీ టెట్ ఫైనల్ కీ.. 27న ఫలితాలు డౌటేనా? అభ్యర్థుల్లో ఆందోళన..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.