National Pollution Control Day 2021: నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ డే. అంటే జాతీయ కాలుష్య నివారణ దినోత్సవం అన్నమాట. ప్రతీ ఏడాది డిసెంబర్ 2 వ తేదీన ఈ నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ డే జరుపుకుంటారు. ఈ ఏడాది జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవానికి మరొక రోజే మిగిలి ఉన్న నేపథ్యంలో ఈ రోజుకు ఉన్న ప్రత్యేకత, ప్రాధాన్యత, చరిత్ర నేపథ్యం ఏంటో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

National Pollution Control Day Significance - జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం నేపథ్యం:
భోపాల్ గ్యాస్ దుర్ఘటన గురించి అందరికీ తెలిసిందే. 1984లో డిసెంబర్ 2, 3 తేదీల్లో రాత్రి జరిగిన ఈ ఘోర దుర్ఘటనలో చనిపోయిన వారిని స్మరించుకుంటూ ప్రతీ ఏడాది అదే తేదీ అయిన డిసెంబర్ 2 న జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. భోపాల్‌లోని యూనియన్ కార్బైడ్ కెమికల్ ఫ్యాక్టరీ నుంచి మిథైల్ ఐసోసైనేట్ (MIC) అనే విష రసాయనాలు లీకైన కారణంగా ఈ ఘటన చోటుచేసుకుంది.


Also read : Mark Zuckerberg case : ఫేస్‌బుక్‌లో పోస్ట్‌పై జుకర్‌బర్గ్‌ పై కేసు, అఖిలేష్‌ అభిమాని చేసిన పని ఇది


National Pollution Control Day objectives - జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం లక్ష్యం:
ప్రతీ ఏడాది కాలుష్యంతో ప్రపంచ మానవాళికి జరిగే నష్టాన్ని తెలియజెప్పేందుకే నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ డేను నిర్వహిస్తున్నారు. జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవాన్ని నిర్వహించడం వెనుకున్న మరో లక్ష్యం ఏంటంటే.. పౌరులు కాలుష్యానికి వ్యతిరేకంగా పోరాడేలా వారికి అవగాహన కల్పించడమే. 


జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవానికి ముందుగా సెంట్రల్ పొల్యుషన్ కంట్రోల్ బోర్డు (CPCB latest updates) కాలుష్యంపై పలు గణాంకాలు విడుదల చేసింది. ఈ ఏడాది నవంబర్‌లో ఢిల్లీలో జరిగినంత గాలి కలుషితం గత ఏడు సంవత్సరాల్లో ఎన్నడూ జరగలేదని జాతీయ కాలుష్య నివారణ మండలి పేర్కొంది.


Also read : Woman goes topless with Mehendi Blouse design : జాకెట్‌కు బదులు మెహందీ బ్లౌజ్-ఆ మహిళను తిట్టిపోస్తున్న నెటిజన్లు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook