Dry Cough: హాస్పిటల్‌కి వెళ్లకుండా దగ్గు తగ్గాలంటే ఇలా చేయండి..
Dry Cough Remedies: పొడి దగ్గు సమస్యతో బాధపడుతున్నారా? హాస్పిటల్‌కి వెళ్లాల్సిన అవసరం లేదు ఇంట్లోనే సులభంగా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. దీని కోసం ప్రతిరోజు ఇంట్లో ఉపయోగించే పదార్థాలు వాడుతే సరిపోతుంది.
Dry Cough Remedies: చలికాలంలో పొడి దగ్గు చాలా మందిని వేధిస్తుంది. అయితే హాస్పిటల్‌కి వెళ్ళకుండానే ఇంటి చిట్కాలతో ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. మనం ప్రతిరోజు ఇంటో ఉపయోగించే కొన్ని వస్తువులతో దగ్గుకు చెక్ పెట్టవచ్చు. వీటిని ఎలా ఉపయోగించాలి అనేది మనం తెలుసుకుందాం.
పొడి దగ్గు తగ్గించుకొనేందుకు మార్గాలు:
ఉదయం నిద్రలేవగానే ప్రతిరోజు గోరువెచ్చని నీటిని తాగడం మంచిది. దీని వల్ల శరీరం హైడ్రుట్‌గా ఉండటమే కాకుండా గొంత నొప్పి తగ్గి గొంతును తేమగా ఉంచుతుంది. గొంతు నొప్పికి అల్లం కూడా ఎంతో మేలు చేస్తుంది. అల్లంలో యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ అధికంగా ఉంటాయి. ఇది గొంతు వాపును తగ్గిస్తుంది. దీని కోసం మీరు ఒక కప్పు వేడి నీటిలో అర టీస్పూన్ అల్లం పొడిని కలిపి తాగండి. తేనె కూడా పొడి దగ్గును తగ్గించడానికి ఎంతో సహాయపడుతుంది. దీని కోసం మీరు ఒక టీస్పూన్ తేనెను వెచ్చని నీటిలో కలిపి తాగండి. పొడి దగ్గు ఎక్కువగా ఉంటే ఒక పాత్రలో వేడి నీటిని తీసుకొని తలను పాత్రపై వంచి ఒక తువ్వాలతో కప్పుకోండి. ఆవిరి లోతుగా పీల్చుకోవడం గొంతును తేమగా ఉంచుతుంది. లేదా వేడి నీటిలో కొన్ని చుక్కల యూకలిప్టస్ ఆయిల్ వేసి ఆవిరి పట్టడం కూడా మంచి ఫలితం ఇస్తుంది. చిన్న పిల్లలకు తేనె, నిమ్మకాయ కలిని నీరు తాగించడం వల్ల పొడి దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది.
తులసి కూడా పొడి దగ్గును తగ్గించడంలో కీలక ప్రాత పోషిస్తుంది. దీని కోసం మీరు తులసి ఆకులను తీసుకొని నీటిలో మరిగించి తరువాత జలడతో వడకట్టి ఆ నీటిని పడుకొనే ముందు తాగడం మంచిది. కొన్ని సార్లు ఉప్ప నీరు కూడా గొంతు నొప్పిని తగ్గించడం లో సహాయపడుతుందని వైద్యులు చెబుతున్నారు. పొడి దగ్గు ఉన్నప్పుడు మృదువైన ఆహారం తీసుకోవడం మంచది. పొడి దగ్గుకు సూప్, దినుసు గంజి, పండ్లు రసాలు తీసుకోవడం మంచిది. నిద్ర లేకపోవడం దగ్గును మరింత తీవ్రతరం చేస్తుంది. కాబట్టి తగినంత నిద్ర తీసుకోవడం చాలా ముఖ్యం. ధూమపానం, ధూళి, పొగ వంటి వాటి నుంచి దూరంగా ఉండండి లేదంటే దగ్గు మరింత పెరుగుతుంది. ఈ ఇంటి చిట్కాలు అన్నింటికీ పనిచేయకపోతే వైద్యుడిని సంప్రదించండి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి