వేపతో ఆరోగ్యానికి చాలా రకాల ప్రయోజనాలుంటాయి. ఎందుకంటే ఈ చెట్టుకు చెందిన ప్రతి భాగం ఆరోగ్యానికి ప్రయోజనం కల్గిస్తుంది. వేపాకులు, వేప కలప, వేప పండ్లు, వేప పువ్వు అన్నింటిలోనూ ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే వేపను ఆయుర్వేద ఖజానాగా చెబుతారు. అయితే వేపను బరువు తగ్గించేందుకు ఎలా ఉపయోగిస్తారు..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రోజూ వేపాకులు నమలడం


ఆరోగ్య నిపుణుల ప్రకారం ఒకవేళ ప్రతిరోజూ 3-4 వేపాకులు తింటే..ఆరోగ్యానికి అద్భుతమైన ప్రయోజనాలున్నాయి. వేపాకుల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ సెప్టిక్ గుణాలున్నాయి. ఇవి ఇన్‌ఫెక్షన్ నుంచి కాపాడుతాయి.


వేపాకుల ప్రయోజనాలు


వేపాకులు తినడం వల్ల అధిక బరువు సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. ప్రతిరోజూ ఉదయం వేపాకులతో జ్యూస్ చేసుకుని తాగవచ్చు. ఫలితంగా కడుపు చుట్టూ ఉండే కొవ్వు పూర్తిగా కరిగిపోతుంది. 


వేపాకుల్ని నమలడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. అంటురోగాల ముప్పు తగ్గుతుంది. కరోనా సంక్షోభ సమయంలో చాలామంది ఇమ్యూనిటీ పెంచుకునేందుకు ఈ పద్ధతిని అవలంభించారు. 


వేపతో శరీరంలోని విష పదార్ధాలను బయటకు తొలగించవచ్చు. అందుకే వేపాకు జ్యూస్‌ను డీటాక్సింగ్ డ్రింక్‌గా పిలుస్తారు.


వేపాకుల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీంతో జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మెటబోలిజం వృద్ధి చెందుతుంది.


వేపాకుల్లో చాలా రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కేలరీలను బర్న్ చేస్తాయి.


దంతాల కేవిటీ సమస్యలో కూడా వేపాకుల అద్భుతంగా ఉపయోగపడతాయి. వేపాకుల్నిపేస్ట్ చేసి ఆ మిశ్రమాన్ని దంతాలకు రాసుకోవాలి. దీనివల్ల నోటి సమస్యలు దూరమౌతాయి.


శరీరంపై ఎక్కడైనా కాలిన గాయాలైతే..వేపాకుల్ని రుద్ది ఆ మిశ్రమాన్ని రాయాలి. ఇందులోని యాంటీ సెప్టిక్ గుణాలు గాయాన్ని నయం చేస్తాయి.


Also read: Lungs Cancer Symptoms: లంగ్ కేన్సర్ లక్షణాలేంటి, ఎలా గుర్తించవచ్చు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook