ఆధునిక శాస్త్ర విజ్ఞానం ఎంతగా అభివృద్ధి చెందినా..ప్రాణాంతక కేన్సర్ వ్యాధికి మాత్రం ఇప్పటికీ సరైన చికిత్స లేదు. కేన్సర్‌లో ముఖ్యమైన లంగ్ కేన్సర్‌ను ఎలా గుర్తించాలో తెలుసుకుందాం.. లంగ్ కేన్సర్ లక్షణాలెలా ఉంటాయి.
అత్యంత ప్రమాదకరమై కేన్సర్ వ్యాధి మనిషిని నిలువునా కృశింపచేసి..ప్రాణం తీస్తుంది. ఇవాళ మనం ప్రమాదకరమైన ఊపిరితిత్తుల కేన్సర్ గురించి తెలుసుకుందాం. అసలు ఊపిరితిత్తుల కేన్సర్ ఎలా వచ్చిందో కొన్ని సులభమైన లక్షణాల ద్వారా తెలుసుకోవచ్చంటున్నారు వైద్య నిపుణులు.
గోర్ల ఆకారంలో మార్పు
గోర్ల ఆకారాన్ని బట్టి లంగ్ కేన్సర్‌ను పసిగట్టవచ్చు. ఊపిరితిత్తుల కేన్సర్ సోకితే..ఆ వ్యక్తుల వేలి గోర్లు విచిత్రంగా ఆకారం మారతాయి. ఉబ్బెత్తుగా, విభిన్నమైన ఆకారంలో ఉంటాయి. వేళ్ల పైభాగం ఎఫెక్ట్ అవుతుంది. కాలిగోర్లతో కూడా మార్పు వస్తుంది. ఫింగర్ క్లబ్ జరిగితే ఊపిరితిత్తుల కేన్సర్‌గా నిర్ధారణ చేయవచ్చు. గోర్లు మృదువుగా మారడం లేదా లేచినట్టు అన్పించడం కేన్సర్ లక్షణాలు కావచ్చు.
ఊపిరితిత్తుల కేన్సర్‌కు ఇంకా ఇతర లక్షణాలు కూడా ఉన్నాయి. తరచూ దగ్గు ఎక్కువగా ఉండటం, ఛాతీలో నొప్పి ప్రధాన లక్షణాలు. శ్వాస తీసుకోవడంలో తరచూ ఇబ్బంది ఎదుర్కోవడం, దగ్గుతున్నప్పుడు రక్తం కారడం, తీవ్రమైన అలసట, బరువు విపరీతంగా తగ్గడం కేన్సర్ లక్షణాలుగా చెప్పవచ్చు.
లంగ్ కేన్సర్‌కు చెక్ ఎలా
ఊపిరితిత్తుల కేన్సర్ సమస్యను రక్షించుకోవాలంటే..ముందుగా ధూమపానానికి దూరంగా ఉండాలి. చుట్టుపక్కల ఎవరైన ధూమపానం చేస్తుంటే దూరంగా ఉండండి. ఎందుకంటే పాసివ్ స్మోకింగ్ కూడా డేంజర్. ఇక పనులు చేసేటప్పుడు కార్సినోజెన్స్‌కు దూరంగా ఉండాలి. సిమెంట్, దుమ్ము, ధూళికి దూరంగా ఉంటే మంచిది. ఈ జాగ్రత్తలు పాటిస్తూ..ఆహారపు అలవాట్లలో మార్పులు, క్రమం తప్పని వ్యాయామం చేయాల్సి ఉంటుంది.
Also read: Black Coffee Benefits: బ్లాక్ కాఫీతో ప్రాణాంతక కేన్సర్‌కు సైతం చెక్, ఇవీ ప్రయోజనాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook