Nethalla Iguru Recipe: చేపలను మన ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటామని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా నెత్త‌ళ్ళు చేపలను తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుంది.చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. నెత్త‌ళ్ళ‌తో చేసే కూర‌లు చాలా రుచిగా ఉంటాయి. వాస‌న రాకుండా ఈ ఇగురును వండుకోవ‌చ్చు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నెత్త‌ళ్ళ ఇగురుకి కావాల్సిన ప‌దార్థాలు:


ఎండు నెత్త‌ళ్ళు, నూనె , ఆవాలు, వెల్లుల్లి త‌రుగు, క‌రివేపాకు, చిన్న‌గా త‌రిగిన పెద్ద ఉల్లిపాయ, చిన్న‌గా త‌రిగిన పెద్ద ట‌మాటాలు, ఉప్పు, ప‌సుపు, ధ‌నియాల పొడి , కారం, నీళ్లు, తరిగిన కొత్తిమీర.


నెత్త‌ళ్ళ ఇగురు తయారీ విధానం:


ముందుగా క‌ళాయిలో నెత్త‌ళ్ళ‌ను వేసి వేయించాలి. వీటిని ఆరు నిమిషాల పాటు  వేయించిన త‌రువాత వేడి నీటిలో వేసి కలుపుతూ క‌డ‌గాలి.
 నీళ్లు తెల్ల‌గా వ‌చ్చే వ‌ర‌కు క‌డిగిన త‌రువాత ప‌క్క‌కు తీసుకోవాలి. త‌రువాత నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ఆవాలు వెల్లుల్లి త‌రుగు, క‌రివేపాకు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్క‌లు కూడా వేసి వేయించాలి.  


ట‌మాట ముక్క‌లు మెత్త‌గా ఉడికి నూనె పైకి తేలిన త‌రువాత కారం, ధ‌నియాల పొడి వేసి బాగా క‌ల‌పాలి.  ఇందులో నీళ్లు పోసి నూనె పైకి తేలే వ‌ర‌కు ఉడికించాలి. నూనె పైకి తేలిన  నెత్త‌ళ్ళ‌ను వేసి క‌ల‌పాలి. అనంతరం ఉడికించిన త‌రువాత కొత్తిమీర చ‌ల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే నెత్త‌ళ్ళ ఇగురు త‌యార‌వుతుంది.


Also Read Tamarind Seeds: మంగు మచ్చలను తొలగించడం ఈ గింజలు ఎంతో ఉపయోగపడుతాయి!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter