Smart TV cleaning tips : ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్ లాగా ప్రతి ఒక్కరి ఇంటి లో టీవీ కూడా ఒక నిత్యవసర పరికరంగా మారిపోయింది. ఎంటర్టైన్మెంట్ అనగానే చాలామందికి గుర్తు వచ్చేది టీవీ మాత్రమే. ప్రతి ఇంట్లో ఎల్ ఈ డి టీవీ కానీ స్మార్ట్ టీవీ కానీ ఉంటూనే ఉంటుంది. గతం తో పోల్చుకుంటే ఇప్పుడు స్మార్ట్ టీవీల కోసం ప్రజలు లక్షల రూపాయలు వెచ్చిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కానీ చాలామంది ప్రజలకి అంత ఖర్చు పెట్టి కొన్న టీవీల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మాత్రం తెలుసుకోవడం లేదు. ఈ నేపథ్యంలోనే ప్రకాశం జిల్లా ఒంగోలు కి చెందిన ఒక  సీనియర్ టీవీ మెకానిక్ రాజు అనే వ్యక్తి కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. టీవీ త్వరగా పాడైపోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఆయన చెప్పుకొచ్చారు.


ఒంగోలు లోని తన బాపూజీ కాంప్లెక్స్ దుకాణంలో వేల రూపాయలు ఖర్చుపెట్టి ప్రజలు ఎల్ఈడి టీవీలు కొనుక్కుంటూ ఉంటారట. అయితే ఈ టీవీ లని ఎలా వాడాలో వారికి అవగాహన లేకపోతే అది కేవలం వారికి ఆర్థిక భారంగా మాత్రమే మారుతుంది అని ఆయన అంటున్నారు. ఈ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మాట్లాడుతూ ముందుగా చిన్న పిల్లలను టీవీలకి దగ్గరకు వెళ్లకుండా చూసుకోవాల్సి ఉంటుందని అన్నారు. టీవీ తెరమీద పెన్నుతో కానీ ఇతర వస్తువులతో కానీ కొట్టినా టీవీ పనిచేయకుండా పోతుందని హెచ్చరించారు.


అంతేకాకుండా కొంతమంది తమ టీవీలను తడి గుడ్డలతో శుభ్రపరుస్తూ ఉంటారని ఎట్టి పరిస్థితుల్లోనూ తడి గుడ్డని స్క్రీన్ తుడవడం కోసం వాడకూడదని అన్నారు. టీవీ ని క్లీన్ చేయాలి అనుకున్న ప్రతిసారి కేవలం పొడి టవల్ మాత్రమే వాడాలని అన్నారు. ఒకవేళ వర్షాకాలంలో కరెంట్ వస్తూ పోతూ ఉంటే ఆ టైంలో టీవీ ప్లగ్ తో పాటు డిష్ వైర్ కూడా తీసేయటం మంచిదని అన్నారు.


కరెంట్ ఎక్కువగా పోతూ వస్తూ ఉంటే టీవీ కూడా రిపేర్ చేయించాల్సి వస్తుందట. లేకపోతే వోల్టేజ్ విషయంలో తేడాలు వచ్చి షార్ట్ సర్క్యూట్ కూడా అయ్యే ప్రమాదం ఉందని అన్నారు. ఇక ఆన్ లైన్ లో టీవీ రిపేర్ వీడియోలు చూసి టీవీని సొంతంగా రిపేర్ చేసుకోవడం వంటివి చేయకపోవడం మంచిదని కేవలం టీవీ మెకానిక్ చేస్తేనే నాణ్యత ఉంటుందని సూచించారు.


Also Read: Samsung Mobile Loot Offer: సాంసంగ్‌ వెబ్‌సైట్‌లో పిచ్చెక్కించే డీల్స్‌..Galaxy F54, M34 మొబైల్స్‌పై భారీ తగ్గింపు!  


 


Also Read: Oneplus 12 Launch: పిచ్చెక్కిపోయే ఫీచర్స్‌తో మార్కెట్లోకి Oneplus 12 స్మార్ట్ ఫోన్..ధర, ఫీచర్ల వివరాలు ఇవే..  


 


 


 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook