Nutmeg Benefits: జాజికాయ తినడం వల్ల శరీరానికి ఇన్ని లాభాలా?
Nutmeg Benefits: జాజికాయ ఎక్కువగా ఆహారాల్లో వినియోగిస్తూ ఉంటారు. దీనిని ప్రతి రోజు ఆహారాల్లో వినియోగించడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధులు కూడా దూరమవుతాయి.
Nutmeg Benefits: జాజికాయ అనేది సువాసన, మంచి రుచి కలిగిన ఓ ప్రసిద్ధ సుగంధ ద్రవ్యం. ఇది జాతిపత్రి చెట్టు (Myristica fragrans) విత్తనం నుంచి వస్తుంది. వీటిని ఎక్కువగా ఇండోనేషియా దేశంలో పండిస్తూ ఉంటారు. ఈ జాజికాయతో 7వ శతాబ్దంలోనే చైనీలు వాణిజ్యం చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు జాజికాయను ఆహారాల్లో వినియోగిస్తూనే ఉన్నారు. నిజానికి చాలా మంది దీనితో తయారు చేసిన పోడిని పాలలో కలుపుకుని తాగుతూ ఉంటారు. ఇలా తాగడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఎందుకంటే ఇందులో అనేక రకాల ఔషధ గుణాలు లభిస్తాయి. కాబట్టి ఈ జాజికాయను ఆహారాల్లో వినియోగించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
జాజికాయ వల్ల కలిగే లాభాలు:
జీర్ణక్రియ మెరుగుదల:
జాజికాయలోని జీర్ణ ఎంజైమ్స్ అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి దీనిని ఆహారాల్లో తీసుకోవడం వల్ల ఆహారం సులభంగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది. దీంతో పాటు అజీర్ణం, గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు కూడా దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇవే కాకుండా పొట్టకు సంబంధించిన అన్ని సమస్యలు తొలగిపోతాయి.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది:
జాజికాయలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు దీనితో తయారు చేసిన పొడిని పాలలో కలుపుకుని తాగడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అంతేకాకుండా తీవ్ర వ్యాధులు రాకుండా ఉంటాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
నొప్పిలు తగ్గుతారు:
జాజికాయలోని యాంటీ-ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి దీనిని ప్రతి రోజు ఆహారాల్లో వినియోగించడం వల్ల కీళ్ల నొప్పులు, కండరాల నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. దీంతో పాటు తలనొప్పులను తగ్గించడానికి కూడా ఎంతగానో సహాయపడుతుంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది:
జాజికాయ రక్తపోటును తగ్గించడానికి ఎంతగానో సహాయపడుతుంది. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి కూడా ఎంతగానో సహాయపడుతుంది. దీంతో పాటు గుండె ఆరోగ్యం కూగా మెరుగుపడుతుంది.
మెదడు ఆరోగ్యంగా ఉంటుంది:
జాజికాయలో ఉండే యాంటీఆక్సిడెంట్లు మెదడు కణాలను ఆరోగ్యంగా చేసేందుకు కూడా ఎంతగానో సహాయపడుతుంది. దీంతో పాటు అల్జీమర్స్ వ్యాధి, ఇతర న్యూరోడిజెనరేటివ్ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి