Painkiller Vs Gel For Body Pain: మనలో చాలా మంది కీళ్ల నొప్పి, గాయం వల్ల కలిగే శరీర నొప్పులతో బాధపడుతుంటారు. ఈ సమయంలో ఎక్కువగా పెయిన్‌ కిల్లర్‌, జెల్స్‌ను వాడుతుంటారు. వీటిని ఉపయోగించడం వల్ల పెయిన్‌ తగ్గుతుంది. అయితే విటిలో ఏది తీసుకుకుంటే చాలా బెటర్‌ అనేది ఇప్పుడు తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కీళ్లు నొప్పులు అనేవి ఎక్కువగా పనిచేయడం వల్ల లేద శరీరంలో కల్షియం తగ్గడం వల్ల సంభవిస్తాయి. దీని వల్ల విపరీతమైన నొప్పులు వస్తుంటాయి.  దీని కోసం చాలా మంది మందులు, నివారణ జెల్లు, బామ్స్, స్ప్రేల ద్వారా కూడా ఉపశమనం పొందుతారు. అయితే మందులను తీసుకోవడం శరీరానికి మంచిదేనా..?


ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్‌ వల్ల ప్రతి ఒక్కరూ నొప్పిని తర్వగా తగ్గించుకోవడానికి పెయిన్‌ కిల్లర్లను వాడుతారు. నొప్పి నుంచి ఉపశమనం పొందడంలో పెయిన్‌ కిల్లర్ ఎంతో సహాయపడుతాయి. అయితే ఎక్కువగా పెయిన్‌ కిల్లర్లను ఉపయోగించడం వల్ల అనారోగ్యసమస్యల బారిన పడాల్సి ఉంటుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. 


దీని కారణంగా  వాంతులు, గుండెల్లో అధికంగా మంట, అల్సర్‌ వంటి ఇతర సమస్యలకు దారి తీస్తుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. కొన్ని సార్లు ఈ పెయిన్‌ కిల్లర్ల వల్ల కిడ్నీపై తీవ్రమైన ప్రభావం ఉంటుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. కాబట్టి పెయిన్‌ కిల్లర్‌ మందులను తక్కువగా వాడడానికి ప్రయతం చేయడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. పెయిన్ కిల్లర్స్ కంటే అనాల్జేసిక్ జెల్లు చాలా వేగంగా నొప్పిని తగ్గిస్తాయి.


Also Read Orange Peel Tea: ఆరెంజ్‌ పండు తొక్కతో టీ చేసుకోవచ్చా?


పెయిన్‌ కిల్లర్స్‌ బదులుగా చాలా మంది పెయిన్ రిలీఫ్‌ జెల్ వాడుతూ ఉంటారు. ఇవి శరీరానికి హాని కలిగించదు. అంతేకాకుండా ఇవి శరీరంలో కలిగించే నొప్పిని సులువుగా తగ్గిస్తాయి. పెయిన్‌ కిల్లర్లు తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ పై చెడు ప్రభావం చూపుతుంది. దీనిని వ్ల అల్సర్‌ , కడుపుకు సంబంధించిన ఇన్ఫక్షన్‌ సమస్యలు తలెత్తుతాయి. 


పెయిన్‌ రిలీవర్‌ జెల్స్‌ను వాడటం వల్ల మిగిలిన శరీరానికి హాని కలిగించదు. ఇవి వాపును తగ్గిస్తాయి. శరీరాన్ని వేడి చేస్తాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. పెయిన్ రిలీవర్ జెల్స్‌ను మనం ఎక్కువ కాలం వాడినా వాటి వల్ల శరీరానికి ఎలాంటి హాని జరగదు. 


Also Read Waist Fat Reduce: ఈ డ్రింక్‌ వల్ల సులువుగా బరువు తగ్గుతారని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు![[{"fid":"293576","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter