Waist Fat Reduce: ఈ డ్రింక్‌ వల్ల సులువుగా బరువు తగ్గుతారని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు!

Waist Fat Reduce Tips: అధిక బ‌రువుతో బాధ‌ప‌డుతున్నవారి సంఖ్య అధికంగా ఉందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. జంక్ ఫుడ్ అధికంగా తీసుకోవ‌డం, అధికంగా తీసుకోవ‌డం వల్ల ఈ సమస్యల బారిన పడుతున్నారు. ఈ జ్యూస్‌ తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 27, 2024, 10:46 PM IST
Waist Fat Reduce: ఈ డ్రింక్‌ వల్ల సులువుగా బరువు తగ్గుతారని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు!

Waist Fat Reduce Tips: అధిక బ‌రువు కార‌ణంగా షుగ‌ర్, గుండెపోటు, ర‌క్త‌పోటు, కీళ్ల నొప్పులు వంటి  అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. అనారోగ్య స‌మస్య‌ల బారిన ప‌డ‌కుండా ఉండాలంటే బ‌రువు త‌గ్గాల్సి ఉంటుందని  ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.  బ‌రువు త‌గ్గ‌డానికి  ఈ చిట్కాను పాటించ‌డం వ‌ల్ల చ‌క్క‌టి ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చు. మ‌న ఇంట్లో త‌యారు చేసుకుని తాగ‌డం వ‌ల్ల మ‌నం సుల‌భంగా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు.

ఈ జ్యూస్‌ తయారు చేసుకోవ‌డానికి  ముందు ప‌ది మిరియాల‌ను తీసుకుని పొడిలా చేసుకోవాలి. త‌రువాత ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిని తీసుకోవాలి. దానిలో ముందుగా త‌యారు చేసుకున్న మిరియాల పొడితో పాటు ఇంచు దాల్చిన చెక్క ముక్క‌ను కూడా వేసుకోవాలి. ఇందులో అర టీ స్పూన్ ప‌సుపును కూడా వేయాలి. ఈ గిన్నెను స్ట‌వ్ మీద ఉంచి ఈ నీటిని ప‌ది నిమిషాల పాటు బాగా మ‌రిగించాలి.

ఒక గ్లాస్ లో  దంచిన  నాలుగు అల్లం ముక్క‌ల‌ను తీసుకోవాలి.మ‌రిగించిన నీటిని వ‌డ‌క‌ట్ట‌కుండా అలాగే పోయాలి. ఈ నీటిని క‌దిలించ‌కుండా గోరు వెచ్చ‌గా అయ్యే వ‌ర‌కు అలాగే ఉంచాలి. గోరు వెచ్చ‌గా అయిన త‌రువాత ఈ నీటిని తాగాలి. అధిక బ‌రువుతో బాధ‌ప‌డే వారు ఈ జ్యూస్‌న్ని  రెండు సార్లు తాగాలి. దీని వల్ల  5 కిలోల బ‌రువు త‌గ్గాల‌నుకునే  రోజుకు ఒక్క‌సారి మాత్ర‌మే ఈ నీటిని తాగాలి. అలాగే తాగిన త‌రువాత అర గంట వ‌ర‌కు ఎలాంటి ఆహారాన్ని తీసుకోకూడ‌దు.

 ఈ జ్యూస్‌న్నీ క్ర‌మం త‌ప్ప‌కుండా తీసుకోవ‌డం వ‌ల్ల బ‌రువు తగ్గుతారు. జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలి. ఈ జ్యూస్‌న్ని తాగ‌డం వ‌ల్ల అధిక బ‌రువు త‌గ్గ‌డంతో పాటు పొట్ట‌, న‌డుము చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కూడా క‌రుగుతుంది. 

Also Read Ginger Tea Vs Ginger Water: ఆరోగ్యానికి అల్లం టీ బెస్టా..అల్లం వాటర్‌ బెస్టా?..తప్పకుండా తెలుసుకోండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News