Pandu Mirchi Tomato Nilva Pachadi Telugu: భారతీయులు ఎక్కువగా పచ్చళ్ళు తయారు చేసుకునే వాటిల్లో పండుమిర్చి ఒకటి. ఈ పండు మిర్చితో నూటికి అద్భుతమైన రుచి అందించే పచ్చడిని తయారు చేసుకోవచ్చు. అంతేకాకుండా దీనిని వివిధ రకాల పచ్చళ్లలో కూడా వినియోగిస్తారు. ఎందుకంటే ఈ పండుమిర్చి నూటికి కారాన్ని అందించడమే కాకుండా పచ్చడికి రుచిని పెంచేందుకు సహాయపడుతుంది. తెలంగాణలోని కొన్ని పల్లెల్లో ఇప్పటికి పండుమిర్చితో తయారు చేసిన పచ్చళ్ళను వినియోగిస్తున్నారు. వేడివేడి అన్నంలో పండుమిర్చి టమాటో పచ్చడి కాస్తంత దానిపై నుంచి నెయ్యి వేసుకొని తింటే, ఆహా రుచే వేరు అనాల్సిందే. అయితే మీరు కూడా సొంతంగా టమాటో పండుమిర్చి పచ్చడి తయారు చేసుకోవాలనుకుంటున్నారా? మీకోసం మేము సులభమైన పద్ధతిలో ఈ రెసిపీని అందించబోతున్నాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పచ్చడి తయారు చేయడానికి కావలసిన పదార్థాలు:
300 గ్రాముల పండుమిర్చి
500 గ్రాముల టమాటోలు
ఒకటిన్నర టీ స్పూన్ మెంతులు
అర టీ స్పూన్ జీలకర్ర
మూడు టీ స్పూన్ల ఆవాలు
నాలుగు టేబుల్ స్పూన్ల పల్లి నూనె
60 గ్రాముల రాళ్ల ఉప్పు
60 గ్రాముల చింతపండు


తాలింపుకు కావలసిన మరికొన్ని పదార్థాలు:
కప్పు నూనె
రెండు టీ స్పూన్ల శనగపప్పు
మూడు టీ స్పూన్ల మినప్పప్పు
ఒక టీ స్పూన్ ఆవాలు
అర టీ స్పూన్ జీలకర్ర
నాలుగు ఎండుమిర్చి
25 వెల్లుల్లి రెబ్బలు
మూడు రెమ్మల కరివేపాకు



తయారీ పద్ధతి:
ముందుగా ఈ పచ్చడిని తయారు చేయడానికి పండుమిరపకాయలతో పాటు టమాటాలను మంచినీటితో బాగా శుభ్రం చేయాల్సి ఉంటుంది. వీటిని శుభ్రం చేసిన తర్వాత ఓ కాటన్ గుడ్డతో బాగా పదన పోయేంతవరకు తూర్చుకోవాలి. ఆ తర్వాత వీటిని ముక్కలుగా కట్ చేసుకుని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ పై కళాయి పెట్టుకొని అందులో మెంతులు జీలకర్ర వేసి బాగా వేయించాల్సి ఉంటుంది. అవి దూరంగా వేగిన తర్వాత అందులోనే ఆవాలు వేసుకొని మరికొద్దిగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న వీటన్నిటిని మిక్సీ పట్టుకొని పొడిలా తయారు చేసి పక్కన పెట్టుకోవాలి.


ఆ తర్వాత మరోసారి అదే కళాయిలో నూనె పోసుకొని పండుమిర్చి ముక్కలు వేసుకుని ఐదు నుంచి 6 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో వేయించుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత వీటిని పక్కన పెట్టుకొని అదే కళాయిలో నూనె పోసుకొని టమాటో ముక్కలు చింతపండు వేసుకుని బాగా కలుపుతూ మెత్తబడేలా ఎక్కించుకోవాలి. ఆ తర్వాత పక్కన పెట్టుకున్న పండుమిర్చిని మిక్సర్ జార్లో వేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న ఎర్ర మిరపకాయల మిశ్రమాన్ని తడి లేని గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోవాలి.


Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?


ఆ తర్వాత మరో గ్రైండర్ గిన్నెను తీసుకొని అందులో టమాటా ముక్కలు రుచికి సరిపడా ఉప్పును వేసుకొని మిశ్రమంలో బాగా మిక్సీ కొట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా పట్టుకున్న మిశ్రమంలోని ఆవాల పొడి కలిపి పక్కన పెట్టుకోవాలి. మరోసారి స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని అందులో కప్పు నూనె పోసుకోవాలి. ఆ తర్వాత పైన పేర్కొన్న తాలింపు తాలింపు పదార్థాలన్నిటిని ఒక్కొక్కటిగా వేసుకొని.. తాలింపులా తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా తాలింపును తయారు చేసుకొని ఓ 15 నుంచి 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక గాజు మర్తమాన తీసుకొని అందులో తాలింపును పోసుకోవాల్సి ఉంటుంది. ఇందులోనే పక్కన పెట్టుకున్న టమాటా మిశ్రమం, పండు మిరపకాయల మిశ్రమాన్ని వేసుకొని బాగా కలుపుకోవాల్సి ఉంటుంది. ఇలా రెండు నిమిషాల పాటు కలుపుకుంటే ఎర్రమిర్చి టమాటో పండు కారం రెడీ అయినట్లే.


Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter