Peanuts Health Benefits: మనం జర్నీ చేసేటప్పుడు టైమ్ పాస్ కోసం ఎక్కువగా పల్లీలు తింటూ ఉంటాం. సాధారణంగా ఉడకబెట్టినవి, వేయించినవి తింటాం. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. వేరుశెనగలో ఫైబర్, ప్రోటీన్లు, యాంటీఆక్సిడెంట్, అమైనో యాసిడ్ పుష్కలంగా లభిస్తాయి. ఇది చాలా వ్యాధులను రాకుండా అడ్డుకుంటుంది. వేరుశెనగ తినడం వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వేరుశెనగ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు
** వేరుశెనగలో ఉండే యాంటీ యాక్సిడెంట్స్ క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. 
** పల్లీల్లో పైబర్ ఎక్కువగా ఉంటుంది. ఉడకబెట్టిన వేరుశెనగ తినడం వల్ల మీరు బరువు తగ్గుతారు. 
** జీవక్రియను మెరుగుపరచడంలో వేరుశెనగ అద్భుతంగా పనిచేస్తుంది.  
** వేరుశెనగ తినడం వల్ల రక్తంలోని చక్కర స్థాయిలు కంట్రోల్ లో ఉంటాయి. 
** తగిన మోతాదులో వేరుశెనగ తీసుకోవడం వల్ల ఎముకలు గట్టిపడతాయి.
**వేరుశెనగలో విటమిన్ ఏ అధికంగా లభిస్తుంది. దీన్ని తినడం వల్ల మీ కంటిచూపు మెరుగుపడుతుంది.  
**పల్లీల్లో ఐరన్ కూడా ఎక్కువగానే ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల రక్తహీనత ప్రమాదం తగ్గుతుంది. 
** వేరుశెనగలో మోనోఅన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. 
** ఉడికించిన పల్లీల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది కీళ్లకు చాలా మంచిది. 


Also Read: Dry Eyes Problem Solution: పొడి కళ్ల సమస్యలకు ఇలా 2 రోజుల్లో ఉపశమనం పొందవచ్చు!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.